Akshay Thakur files mercy plea before Prez ‘నిర్భయ’ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటీషన్

Nirbhaya case akshay thakur files mercy plea before prez

Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

Akshay Thakur, one of the convicts of the Nirbhaya case, filed a mercy plea before President Ram Nath Kovind. Earlier in the day, the President rejected the mercy plea of Sharma.

‘నిర్భయ’ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటీషన్

Posted: 02/01/2020 03:40 PM IST
Nirbhaya case akshay thakur files mercy plea before prez

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో మరో దోషి దోషి అక్షయ్‌ ఠాకూర్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనకు దరఖాస్తు చేసుకున్నాడు. నిర్భయ కేసులో సహచర దోషి వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే మరో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ క్షమాభిక్షకు అప్పీలు చేసుకోవడం గమనార్హం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న క్యూరేటివ్ పిటీషన్ న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో ఆయన మెర్సీ పిటీషన్ పెట్టుకున్నారు.

రెండు రోజుల క్రితం అక్షయ్‌ క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రజాభిప్రాయాలను అనుసరించి కోర్టులు సర్వరోగ నివారిణిగా దోషులకు మరణశిక్ష విధిస్తున్నాయని అతడు తన క్యూరేటివ్‌ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్‌లో పరిశీలించిన అనంతరం తిరస్కరించింది. కాగీ నిర్భయ కేసు న్యాయస్థానం నలుగురు దొషులకు ఉరిశిక్షను విధించిన తరువాత దానిని తప్పించుకునే క్రమంలో దోషులు ఎత్తుగడలు వేస్తున్నారు.

వీరితో ముకేశ్ కు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలూ ముగిసిపోయాయి. ఇక అక్షయ్ కు కూడా ఈ క్షమాభిక్ష పిటిషన్‌తో ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నీ మూసుకుపోనున్నాయి. నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాల్సి ఉండగా ఢిల్లీలోని పాటియాల కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. కాగా, ఇవాళ ఉరి తీసేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేయగా, చివరి నిమిషంలో వాళ్లు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాల్సిందిగా దోషులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ కోర్టు ఉరి అమలును వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి ఆపాలని తీహాడ్‌ జైలు అధికారులకు తెలిపింది.

ఈ నలుగరు దోషుల్లో పవన్ గుప్తా ఒక్కడే ఇప్పటివరకు అుట క్యూరేటివ్ పిటీసన్ కానీ, మెర్సీ (క్షమాభిక్ష) పిటీషన్ కానీ న్యాయస్థానంలో దాఖలు చేయలేదు. ఎటువంటి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోలేదు. క్యూరేటివ్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదు. ఉరి అమలుపై స్టే విధించడంపై నిర్భయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఇటువంటి వ్యక్తులకు జీవించే హక్కు లేదని, బతికి ఉంటే ఏదో ఒక విధంగా ఉరి ఆపేందుకు ప్రయత్నాలు జరుపుతూ న్యాయవ్యవస్థను అవహేళన చేస్తున్నారని బీజేపి ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు దోషులను తక్షణమే ఉరి తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles