Nirbhaya case convict seeks urgent hearing in SC‘నిర్భయ’ దోషి పీటీషన్ టాప్ ప్రియారిటీ: సుప్రీంకోర్టు

Nirbhaya case mukesh kumar seeks urgent hearing in supreme court

Nirbhaya, Murder, Rape, convict, Mukesh singh, Ramnath Kovind, Supreme Court, execution, CJI, Chief Justice SA Bobde, Mercy plea,Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

A bench headed by Chief Justice SA Bobde said, “If somebody is going to be hanged then nothing can be more urgent than this”, and asked Kumar’s counsel to approach the mentioning officer as the hanging is scheduled on February 1. The bench also comprised justices BR Gavai and Surya Kant.

‘నిర్భయ’ దోషి పీటీషన్ టాప్ ప్రియారిటీ: సుప్రీంకోర్టు

Posted: 01/27/2020 01:17 PM IST
Nirbhaya case mukesh kumar seeks urgent hearing in supreme court

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న పటీషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించింది. 'ఎవరైనా దోషికి మరణశిక్ష విధించబోతున్న క్రమంలో అతను పెట్టుకున్న పిటిషన్ కంటే అర్జెంట్ గా విచారించాల్సిన అంశం ఏదీ ఉండదు. దానికి అత్యున్నత ప్రాధాన్యత (టాప్ ప్రియారిటీ) ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నిర్భయ కేసు దోషి ముకేష్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనపై అర్జెంట్ లిస్టింగ్ కోసం రిజిస్ట్రీని సంప్రదించాలని ఆయన తరఫున న్యాయవాదిని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. చివరి ప్రయత్నంగా ముకేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 17న తోసిపుచ్చారు. దీంతో ముఖేష్ కు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించాలని కోరుతూ ఆయన తరఫు లాయర్ వృందా గ్రోవెర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగానే బెంచ్ తాజా వ్యాఖ్యలు చేసింది.

'మరణశిక్ష ఖరారైన దోషి కోర్టు ముందుకు వస్తే దానికంటే అర్జెంట్‌గా చేపట్టాల్సిన అంశం ఇంకేముంటుంది. దానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి' అని సీజేఐ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఆర్ గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. కాగా, దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయనున్నందున కేసు అర్జెంట్ లిస్టింగ్ కోసం రిజిస్ట్రీని గ్రోవెర్ కలుసుకోవాలని సూచించింది. ముకేష్, మరో దోషి వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్‌వీ రమణతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈనెల 15న తోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles