Dekho apna desh" pledge to boost local tourism పర్యాటకుల పంట పండించిన కేంద్రం.. బంపర్ ఆఫర్

Government to reward travellers visiting 15 domestic tourist in a year

Prahlad Singh Patel, domestic tourism, travllers, union minister for tourism,Naveen Patnaik,minister, Konark, Dharmendra Pradhan, Indian Tourism

Tourism Ministry will fund the travel expenses of tourists who visit 15 destinations in the country in a year and submit the photos to our website, says Prahlad Singh Patel

పర్యాటకుల పంట పండించిన కేంద్రం.. బంపర్ ఆఫర్

Posted: 01/25/2020 06:15 PM IST
Government to reward travellers visiting 15 domestic tourist in a year

టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం భలే ఆఫర్‌ను ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన  ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ అందించనుంది. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్  ప్రకటించారు. కోణార్క్‌లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. సంవత్సరం లోపు ఈ టాస్క్‌ను పూర్తి చేసిన  టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు. టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం  తీసుకున్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  ‘పర్యాటన్‌ పర్వ్‌’ కార్యక్రమంలో భాగంగా  అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతు. ఇందుకు గాను వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా   ప్రోత్సాహక​ బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు.  సంబంధిత  ఫోటోలను తమ వెబ్‌సైట్‌లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు.

త్వరలోనే కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు. అంతేకాదు టూరిస్టు గైడ్స్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్‌ కూడా నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువ, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు. మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles