Nirbhaya case convicts tight-lipped on last wish ‘నిర్భయ’ దోషుల కుటుంబాలకు జైలు అధికారుల సమాచారం..!

Tihar jail authorities ask nirbhaya convicts families to about their last wish

last wish, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

The lawyer of the Nirbhaya rape accused has yet again moved the Patiala House Court alleging that the Tihar Jail authorities are causing delay in filing mercy petitions. The plea moved by the Advocate AP Singh will be heard on Saturday at the Patiala House Court.

పాటియాల కోర్టులో ‘నిర్భయ’ దోషుల పిటీషన్.. రేపు విచారణ

Posted: 01/24/2020 01:36 PM IST
Tihar jail authorities ask nirbhaya convicts families to about their last wish

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు శిక్షను అమలు పర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షను అమలుపర్చే ముందు..  జైలు నిబంధనల ప్రకారం దోషుల చివరి కోరికను తీర్చాల్సి బాధ్యత కూడా అధికారులపై వుంటుంది. ఈ నేపథ్యంలో దోషులను తమ చివరి కోరిక ఏంటని అడిగిన క్రమంలో వారంతా మౌనంగా వున్నారని, అదీకాక తమకు విధించిన శిక్ష ఈ సారి కూడా వాయిదా పడుతుందన్న నమ్మకంతో వున్నారన్న జైలు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.

కాగా, దోషుల నుంచి తమ కుటుంబసభ్యులను చూడాలన్న కోరిక రాకపోవడంతో.. కనీసం వారి కుటుంబసభ్యులకైనా దోషులను కడసారి కలుసుకునే అవకాశం కల్పించేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా, దోషుల కుటుంబసభ్యులను జైలుకు ములాఖాత్ కోసం రమ్మని పలిచారు. కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ మేరకు నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు ఉరితీస్తున్నామని, మీ వారిని చివరిసారిగా చూడాలని ఉంటే ఈలోగా జైలుకు రావాలని దోషుల కుటుంబ సభ్యులకు తీహార్‌ జైలు అధికారులు సమాచారం అందించారు.

నిర్భయ దోషులు వినయ్‌శర్మ, అక్షయ్‌, ముఖేష్‌, పవన్ లకు న్యాయస్థానం జారీ చేసిన డెత్ వారెంట్ మేరకు ఉరిశిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. దోషులు మౌనంగా వుండటంతో జైలు అధికారులే చొరవ తీసుకుని వారి కుటుంబసభ్యులను దోషులను చూసేందుకు రావాలని సమాచారం ఇచ్చారు. మీ పిల్లలను చూడాలని ఉంటే రావాలని కోరారు. కాగా, ఉరిశిక్ష అమలుకు అధికారులు జైలు నెం3లో ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇసుక బస్తాలతో ట్రయల్స్‌ కూడా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన పవన్‌ జల్లద్‌ నలుగురు దోషులను ఉరితీయనున్నారు.

పాటియాలా కోర్టుకు దోషుల పిటీషన్

నిర్భయ కేసులో దోషులు అనుకున్నట్లుగానే చివరి నిమిషంలో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో డెత్ వారెంట్ జారీ అయిన నలుగురిలో పవన్, అక్షయ్ ఇద్దరి తరపున వారి న్యాయవాది ఇవాళ ఢిల్లీలోని పాటియాల కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాము క్లయింట్ల తరపున క్షమాబిక్ష, క్యూరేటివ్ పిటీషన్లను దాఖలు చేయడంలో జైలు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని అరోపిస్తూ దోషుల తరపున న్యాయవాది ఏపీ సింగ్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. పవన్, అక్షయ్ తరుపన క్షమాబిక్ష, క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయడానికి సంబంధించిన డాక్యూమెంట్లను ఇచ్చేందుకు జైలు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆయన పిటీషన్లో పేర్కోన్నారు. కాగా ఈ పిటీషన్లపై న్యాయస్థానం రేపు విచారణ చేప్టటనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles