Sabari Express timmings and Shedule changed ఇకపై సికింద్రాబాద్ నుంచే ‘శబరి’.. ధర్మవరం దారిమళ్లింపు..

Sabari express begins from secundrabad instead of nampally

Sabari Express starts from Secundrabad, Sabari Express train timmings, Sabari Express secundrabad, Sabari Express Train, Secundrabad, Hyderabad deccan, Dharmavaram express, Vijayawada, Nandyal, Renigunta, Gudur, Diversion

Sabari Express Train which runs from Hyderbad Deccan to Trivandrum Cntl begins from secundrabad instead, from 27th January with change in timming. Dharmavaram Express which runs between Dharamavam and Vijayawada will be diverted via Renigunta and Gudur instead of Nandyal.

ఇకపై సికింద్రాబాద్ నుంచే ‘శబరి’.. ధర్మవరం దారిమళ్లింపు..

Posted: 01/24/2020 10:48 AM IST
Sabari express begins from secundrabad instead of nampally

హైదరాబాద్-తిరువనంతపురం మధ్య వయా గుంటూరు నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. డిపార్చర్ పాయింట్ లో మార్పులతో పాటు రైలు బయలుదేరే సమయంలోనూ మార్పులు జరిగాయి. ఈ నెల 27 నుంచి ట్రెయిన్ టైమింగ్స్ లో మార్పులు మొదలువుతాయి. హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ నుంచి ఇన్నాళ్లుగా ప్రారంభమయ్యే శబరి ఎక్స్‌ప్రెస్ ఇకపై హైదరాబాద్ నుంచి కాకుండా సికింద్రాబాద్ నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

ఈ రైలు 27 నుంచి సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరుతుంది.. సాయంత్రం 5 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. అలాగే తిరువనంతపురం నుంచి బయల్దేరి సికింద్రాబాద్‌‌ వచ్చే శబరి ఎక్స్‌ప్రెస్‌.. ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 6.28కి తెనాలి, 6.55కి గుంటూరు వస్తుంది.. మధ్యాహ్నం 12.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. రైలు ప్రయాణీకులు ఈ మార్పుల్ని గమనించాలని చెబుతున్నారు. అంతక ముందు శబరి ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరేది.. కానీ ఆ స్టేషన్‌ను తగ్గించి.. సికింద్రాబాద్ నుంచి నడుస్తుంది.

ధర్మవరం-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు దారిమళ్లింపు

ధర్మవరం, గుత్తి, ఎర్రగుంట్ల నుంచి వయా నంద్యాల ద్వారా విజయవాడకు వెళ్లే దర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జనవరి 26 వ తేదీనుంచి డైవర్షన్‌ చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ట్రైన్ నెంబరు 17216 ధర్మవరం గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా విజయవాడ వెళ్లే రైలును ధర్మవరం, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, గూడూరు మీదుగా విజయవాడకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. అంటే నంద్యాలకు బదులు రేణిగుంట మీదుగా దారిమళ్లించారు.
 
అలాగే ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లే ట్రైన్‌ నెంబర్‌ 17215 కూడా విజయవాడ, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి మీదుగా ధర్మవరం వెళ్లనున్నది. ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు డివిజన్‌లో నాన్‌ఇంటర్‌లాకింగ్‌ సిస్టం పనులు నిర్వహిస్తునందువల్ల ఈరైలును వయా రేణిగుంట మళ్లిస్టున్నట్లు తెలిసింది. అయితే ఈ డైవర్షన్‌లో మద్యలో వచ్చే రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఆగకపోవచ్చునని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles