Revanth Reddy Shocking Allegations On KTR కేటీఆర్ ఆస్తులు ఐదింతలెలా పెరిగాయ్?: రేవంత్ రెడ్డి

Mp revanth reddy shocking allegations on ktr in open letter to cm kcr

KTR, Assets Growth, Raise in Party Funds, Revanth Reddy, TRS, Congress, KCR, CM KCR, Open Letter, Member of Parliament, Telangana, Politics

Congress MP A. Revanth Reddy has accused TRS working president K.T. Rama Rao of lying on the funds provided to corporations and municipalities, and wanted to know why the officials were coming up with repeated answers of ‘no funds’ when people go with representations.

కేటీఆర్ ఆస్తులు ఐదింతలెలా పెరిగాయ్?: రేవంత్ రెడ్డి

Posted: 01/18/2020 06:18 PM IST
Mp revanth reddy shocking allegations on ktr in open letter to cm kcr

2014లో రూ.8కోట్లు ఉన్న కేటీఆర్‌ ఆస్తి రూ.41 కోట్లకు ఎలా పెరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మంత్రి కేటీఆర్‌ అవినీతిపై విచారణకు ఆదేశించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. జీవో పరిధిలో బినామీ పేరుతో రాజమహల్ కట్టుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి 111 జీవో సమీక్షిస్తామంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 111 జీవో పరిధి నుంచి కొన్ని గ్రామాల మినహాయింపు వెనుక కుట్ర ఉందన్న రేవంత్ రెడ్డి... పుప్పాలగూడలో రూ.30కోట్ల విలువైన ఆస్తిని రూ.కోటికే ఎలా కొన్నారని ప్రశ్నించారు.

గచ్చిబౌలి, కోకాపేటలో వందల ఎకరాలు మీ సొంతం ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ విరాళాలు రూ.188 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే… మీరు మాత్రం వేల కోట్లకు అధిపతులయ్యారని ఆరోపించారు. త్యాగాల తెలంగాణలో భోగాలు అనుభవిస్తున్నారని.. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు… ఉద్యమాల తెలంగాణను మీరు చెరబట్టారని తెలిపారు. వీటిపై మీరు విచారణకు ఆదేశించకుంటే తామే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ అవినీతి బాగోతాలపై త్వరలో పుస్తకం విడుదల చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh