Congress Wins Big, BJP Loses In Nitin Gadkari's Village బీజేపికి దెబ్బ మీద దెబ్బ.. ఈ సారి కాంగ్రెస్ వంతు.!

Setback for bjp in maharashtra zilla parishad election congress emerges as single largest party

Nagpur, Nagpur Elections, Nagpur Zilla Parishad Election Results, Maharashtra Zilla Parishad Election Results, Congress, BJP, Nitin Gadkari, Devendra Fadnavis

BJP has faced another round of setback after the party suffered defeat in its bastion in Nagpur. of the 58 seats, the Congress emerged as the single largest party with 31 seats.

బీజేపికి దెబ్బ మీద దెబ్బ.. ఈ సారి కాంగ్రెస్ వంతు.!

Posted: 01/08/2020 07:38 PM IST
Setback for bjp in maharashtra zilla parishad election congress emerges as single largest party

భారతీయ జనతా పార్టీకి మరోమారు మహారాష్ట్రలో ఘోర పరాజయం ఎదురైంది. పరిపాలనా పగ్గాలను అందుకోవాలన్న యావతో ముందుకెళ్లి మిత్రుడైన శివసేనతో అధికారాన్ని పంచుకోవడం ఇష్టంలేక ప్రతిపక్షస్థానంలో కూర్చోని పరాభావాన్ని ఎదుర్కోన్న సల్ప వ్యవధిలోనే మరోమారు మరో షాక్ తగిలింది. ఇక ఇప్పుడు తగిలిన షాక్ జాతీయస్థాయిలో వైరివర్గానికి చెందిన కాంగ్రెస్ కావడంతో బీజేపికి కొలుకోలేనిదిగా మారింది. ఇక అందులోనూ ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయమున్న నాగ్‌పూర్లో కావడం గమనార్హం.

మహారాష్ట్రలోని పలు జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్క ధులే జిల్లా పరిషత్ ను మాత్రమే గెలుచుకుంది. నందుర్ బార్ జిల్లా పరిషత్లో కాస్త ప్రభావితం చూపించగలిగింది. ఇక ఆర్ఎస్ఎస్‌కు పట్టున్న నాగపూర్ లో బీజేపీ బొక్క బోర్లా పడింది. మరో విశేషమేమిటంటే నాగ్‌పూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నియోజకవర్గంలో సైతం బీజేపీ బోల్తా పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ప్రతిభను కనబర్చింది.

మిగతా పార్టీలను వెనక్కి నెట్టి అత్యధిక స్థానాలను గెలుపొందింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 58 స్థానాలున్న నాగ్ పూర్ జిల్లా పరిషత్ లో కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ కేవలం 14 స్థానాలు గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలతో మూడవ స్థానంలో ఉంది. శివసేన కేవలం ఒక సీటు మాత్రమే శివసేన గెలుచుకోగలిగింది. ఇతరులు రెండు స్థానాలు గెలుచుకున్నారు.

ఇక అకోలా జిల్లాలో వంచిత్ బహుజన్ అఘాడీ 14 స్థానాలు, బీజేపి ఐదు స్థానాలు గెలువగా, శివసేన 9 స్థానాలు, ఎన్సీపీ 4, కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక వాషిమ్ జిల్లా పరిషత్లోని 52 స్థానాల్లో కాంగ్రెస్ 9, ఎన్సీపీ 12, జన్ వికాస్ అఘాడీ, 7, వంచిత్ బహుజన్ ఆఘాడీ 8, బీజేపి 7, శివసేన 6 స్థానాలను దక్కించుకున్నాయి. ఇక నందూర్బార్ జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపి 23 స్థానాలు కైవసం చేసుకోగా, ఎన్సీపీ 3, శివసేన 7 స్థానాలను కాంగ్రెస్ 23 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో కలసి జట్టుగా పోటీ చేసిన బీజేపి.. రెండున్నర సంవత్సరాల తరువాత అధికార మార్పిడికి అంగీకరించేందుకు సమ్మతించలేదు. దీంతో బీజేపికి శివసేన మద్దతు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోను మోజార్టీలేక బీజేపీ అధికారానికి దూరమైంది. అంతలోనే బాగా పట్టున్న నాగ్‌పూర్లో ప్రత్యర్థి కాంగ్రెస్ చేతిలో ఘోర పరాభవానికి గురైంది. మహారాష్ట్రలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles