Tirumala hundi nets Rs.1161.74 cr. in 2019 తిరుమల శ్రీవారి 2019 వార్షిక హుండీ ఆదాయం ఎంతంటే..!

Tirumala priests to follow dhanurmasam ritual for a month

Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, TTD Hundi Income, TTD calender Year Income, offerings, cash offerings, Vaikunta dwaram, Vaikunta Ekadasi, Mukkoti Ekadasi, Uttara dwara darshanam, devotional

Devotees’ offerings sees a rise of ₹95 crore, up 8.9% over the previous year. calendar year 2019 was bountiful for the Tirumala Tirupati Devasthanams (TTD) in the form of hundi collections.

తిరుమల శ్రీవారి 2019 వార్షిక హుండీ ఆదాయం ఎంతంటే..!

Posted: 01/04/2020 03:18 PM IST
Tirumala priests to follow dhanurmasam ritual for a month

కలియుగ ప్రత్యక్ష దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు తన కల్యాణం కోసం కుభురుడి నుంచి పొందిన రుణాన్ని తన భక్తులు తీర్చుతారని.. అందుకే తాను ఏడుకొండలపై వెలుస్తానని ప్రకటించారని ఓ పురాణకథ వుంది. అయితే ఆ పురాణకథ ప్రకారం కలియుగంలో భక్తులు వడ్డీకాసులవాడు ఇచ్చిన మాట కోసం తమ శక్తికొలది కానుకలు సమర్పిస్తూనే వున్నారు. అవి కొంత కొంతగా ఇంతైవటుడింతై అన్న చందాన.. ఏడాదికేడాది పెరుగుతూ వేల కోట్ల రూపాయలకు చేరుకుంటున్నాయి.

భక్తుల విరాళాలుగా స్వామివారికి సమర్పించిన హుండీ ఆదాయం వార్షికానికి వేల కోట్లకు చేరుకుంటుంది. తాజాగా ముగిసిన 2019 వార్షిక సంవత్సరానికి వెంకన్న ఆలయం నిత్యం భక్తులతో కిట కిట లాడుతూనే ఉంటుంది. భక్తులు ఈ ఆలయానికి ఎలా వస్తుంటారో... స్వామివారికి వచ్చే కానుకలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. గతేడాది స్వామివారి హుండీ ఆదాయాన్ని టీటీడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 2019లో రూ.1,161.74 కోట్ల నగదు హుండీ ఆదాయంగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఈ వివరాలను తెలిపారు. 2018తో పోలిస్తే..... 2019లో స్వామివారి హుండీ ఆదాయం 8.9శాతం పెరిగినట్లు చెప్పారు. ఇక 2019లో స్వామివారిని 2,78,90,179మంది భక్తులు దర్శించుకోగా... 2018లో 2,68,02,047 మంది దర్శించుకున్నారు. ఇక 2019లో 6,45,73,250మంది భక్తులకు అన్నప్రాసాదం అందించగా... 2018లో 6,08,76,434 మంది అన్నప్రసాదం అందించారు.

ఇదిలా ఉండగా.. సోమవారం (జనవరి 6) వ తేదీన వైకుంఠ ఏకాదశి కావడంతో.. ఆరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. అయితే హైకోర్టు అదేశాల మేరకు పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించే అంశంపై అదివారం భేటీ కానున్న టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అనీల్ సింఘాల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles