5 Odias Of A Family Killed In Road Accident అప్పన్న దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు కుటుంబం..

Five of a family died in a road accident at mandasa in srikakulam

Today news Amaravati, trilochan jenna, srikakulam road accident, road mishap, Pilgrims killed, mandasa mandal, Road accident, srikakulam, odisha, odias, simhadri appanna, Visakhapatnam, Andhra Pradesh, Crime

Five persons, including two women and two children, were killed in a road accident on Kottapalli bridge in Mandasa Mandal in Srikakulam district in the early hours of Saturday when the vehicle they were travelling in skidded off and plunged into a canal.

ఘోర రోడ్డు ప్రమాదం: అప్పన్న దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు కుటుంబం..

Posted: 01/04/2020 11:36 AM IST
Five of a family died in a road accident at mandasa in srikakulam

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో విషాధాన్ని నింపింది. విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న దర్శనం కోసం బయలుదేరిన ఆ కుటుంబం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో అనంతలోకాలకు చేరుకుంది. ఇవాళ తెల్లవారు జామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబంలోని ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో పాటు ఇంటి యజమాని, కారు డ్రైవర్ కూడా మరణించాడు. మృతులంతా ఒడిశా వాసులుగా గుర్తించారు.

విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంలో ప్రమాదం సంభవించిందని ప్రాథమిక ధర్యాప్తులో భాగంగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.

మృతుల్లో కారు డ్రైవర్‌, కుటుంబ యజమాని, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్రేన్‌ సాయంతో కాల్వలో పడిన కారును బయటకు తీశారు. మృతులు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన డి.ప్రతాప్‌, రీతూ, బనిత జన్నా, ఆదర్శ్‌కుమార్‌గా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి... పోస్టు మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Road accident  odisha  odias  simhadri appanna  srikakulam  Visakhapatnam  Andhra Pradesh  Crime  

Other Articles