Amaravati farmers stage protest for 17th day అమరావతి అందోళనలు: తొలిరోజు కొనసాగుతున్న సకల జనుల సమ్మె

Amaravati on sakalajanula samme demanding single capital

YS Jagan, Amaravati, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Andhra Pradesh, Politics

The protests by farmers in the Amaravati region demanding the continuation of Amaravati as the capital has reached 17th day. As part of the agitation, a tent was laid on the road at Mandadam. The farmers blocked the road leading to the secretariat in Velagapudi.

అమరావతి అందోళనలు: తొలిరోజు కొనసాగుతున్న సకల జనుల సమ్మె

Posted: 01/03/2020 03:16 PM IST
Amaravati on sakalajanula samme demanding single capital

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతినే కోనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు ఇవాళ్టి నుంచి మరింత ఉదృతంగా మారాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు గత పదిహేడు రోజులుగా నిరసనలురైతులతో పాటు విద్యార్థులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాలుపంచుకుంటున్నారు. దీంతో ఇవాళ్టి నుంచి అమరావతి ప్రాంతంలో సకలజనుల సమ్మెను తలపెట్టారు. ఇవాళ తొలిరోజు సమ్మెలో భాగంగా అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలను అక్కడి ప్రజలు స్వచ్చంధంగా నిలిపివేశారు.

రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పటికైనా సీఎం జగన్, ఏపీ ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్ కోసమంటూ భూములు తీసుకుందని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మరో ప్రతిపాదనను తీసుకువచ్చిందని.. ఇలా ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా తమను అందోళనకు గురిచేస్తే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించారు. దుకాణాలు తెరిపించేందుకు పోలీసులు యత్నించడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఎస్‌.ఆర్‌.ఎం వర్సిటీ బస్సులను అడ్డుకున్న ఆందోళన కారులు రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరి అంబేద్కర్‌ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఎర్రబాలెం, నీరుకొండ, నవులూరు గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వివిధ రాజకీయ పక్షాలు అమరావతికోసం ఆందోళనలకు సిద్ధమయ్యాయి. మందడంలో ఇంటింటికీ వెళ్లి గులాబీ పూలు ఇచ్చిన రైతులు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులు సచివాలయం వైపు వెళ్లే రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి పూలు ఇచ్చి సకల జనుల సమ్మెకు మద్దుతు కోరుతున్నారు.

ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో అసైన్డ్‌ భూముల రైతులు, కూలీలు నిరసన దీక్షచేపట్టారు. మరో వైపు వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో  రైతులకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. గతరాత్రి పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు307 హత్యాయత్నం కేసుతో పాటు మరో  ఏడు సెక్షన్ల కింద కేసులు ఉన్నందున  పోలీస్ స్టేషన్ కు రావాలని పేర్కొన్నారు. విచారణకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు అందజేశారు. దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు జారీ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles