Kerala assembly passes anti-CAA resolution సీఏఏకు వ్యతిరేకంగా కేరళా అసెంబ్లీ తీర్మానం

Kerala government passes anti caa resolution in assembly

Pinarayi Vijayan on CAA, CAA on Pinarayi Vijayan, Pinarayi Vijayan, Citizenship Amendment Act, Mangaluru, Mangaluru violence, violence in Mangaluru, Citizenship Amendment Act, secular outlook, Chief Minister, Pinarayi Vijayan, NRC, Assembly, Resolution, Kerala, Politics

Kerala Chief Minister Pinarayi Vijayan moved a resolution in the state Assembly demanding the scrapping of the controversial Citizenship Amendment Act (CAA). The state assembly has now passed the resolution.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళా అసెంబ్లీ తీర్మానం

Posted: 12/31/2019 04:21 PM IST
Kerala government passes anti caa resolution in assembly

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అందోళనలు జరుగుతున్న క్రమంలో కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసీ తమ వ్యతిరేకతను నేరుగా కేంద్రానికి స్పష్టం చేసింది. ట్రాఫిక్ జరిమానాల విషయంలో తీసుకువచ్చిన సవరణలపై ప్రజాగ్రహం పెల్లుబిక్కిన క్రమంలో దానిపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ బిల్లు విషయంలోనూ రాష్ట్రాల తమ ఇష్టమేరకు నడచుకుంటామని ఆచరణలో ఫాలో అవుతూ తమ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఇందులో భాగంగా కేరళ ప్రభుత్వం మంగళవారం నాడు పౌరసవరణ చట్టాన్నికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ సీఎం పినరయి విజయన్ పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని కోరుతూ కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో కేరళ సీఎం విజయన్‌ ప్రసంగించారు. కేరళ రాష్ట్రానికి సెక్యులరిజానికి చాలా చరిత్ర ఉందని విజయన్ చెప్పారు. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు ఎవరైనా తమ భూభాగంలోకి రావొచ్చని విజయన్ చెప్పారు.

కేరళ అసెంబ్లీ సంప్రదాయాలను కొనసాగిస్తుందని విజయన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశాన్ని ఆర్ఎస్ఎస్ ఎజెండాతో కులాలు,మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ డిసెంబర్ 11వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ బిల్లు దేశ లౌకికవాదానికి విఘాతం కలిగించేదిలా వుందని, రాజ్యాంగ విరుద్దమైన బిల్లు అంటూ కేరళ సీఎం విజయన్ తేల్చి చెప్పారు.ఈ బిల్లు సెక్యులరిజానికి విరుద్దంగా ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles