Four girl students expelled for consuming liquor మద్యం సేవించిన యువతులు.. కాలేజీలో కలకలం..

Dharmapuram adhinam arts college expels 4 girl students for consuming liquor

girl students expelled, Dharmapuram Adhinam Arts College, Mayiladuthurai, principal Swaminathan, video clip, Bharathidasan University, G Gopinath, Trichy, Tamil Nadu, Crime

A booze party with male friends has resulted in the expulsion of four girl students of an arts college in Nagapattinam district. The incident came to light on December 24 when a video clip began circulating on social media.

మద్యం సేవించిన యువతులు.. బహిష్కరించిన కాలేజ్ యాజమాన్యం

Posted: 12/30/2019 04:59 PM IST
Dharmapuram adhinam arts college expels 4 girl students for consuming liquor

నలుగురు కళాశాల విద్యార్థినులు మగ స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం తాగి తందనాలాడారు. ఇంతవరకు బాగానే వున్నా ఈ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో తీవ్ర కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణంలో సంచలనం రేపిన ఈ ఘటన నలుగురు విద్యార్థినుల కాలేజ్ బహిష్కరణకు కూడా కారణమైంది. అసలేం జరిగింది.. అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. నాగపట్టణం జిల్లాలోని మైలదుత్తురాయ్ పట్టణంలోని ధర్మాపురం అధీనం ఆర్ట్స్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు డిగ్రీ చదువుతున్నారు.

ఓ యువతి బీఏ ఇంగ్లీషు లిటరేచర్లో రెండో సంవత్సరం, మరో ముగ్గురు అమ్మాయిలు బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నారు. నలుగురు అమ్మాయిల్లో ఒకరి జన్మదినం ఉండటంతో కళాశాలకు పది కిలోమీటర్ల దూరంలోని సీతార్ కదు గ్రామంలోని ఒకమ్మాయి ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. ఈ మందు పార్టీలో ముగ్గురు అమ్మాయిలు కళాశాల యూనిఫాం ధరించి మగ స్నేహితులతో కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో ఈ నలుగురు యువతులతో పాటు మరో నలుగురు యువకులు కూడా వున్నారు. వారంతా పుట్టిన రోజు జరుపుకుంటున్న అమ్మాయి బంధువులు.

ఇక్కడి వరకు బాగానే వున్నా.. వీరి ప్లాన్ తెలిసి ఫాలో అయ్యాడో లేక తెలియక ఫాలో అయ్యాడో కానీ ఓ స్నేహితుడు కూడా వీరిని గమనిస్తూ.. వీరంతా యువకులతో కలసి యువతులు మద్యం సేవించడాన్ని పూర్తిగా తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ తరువాత దానిని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. ఇంకేముంది అనుకున్నదానికంటే ఎక్కువ వేగంతో ఇది ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలిసి వారిని వాయించారు. అంతటితో అయిపోలేదు.. ఇది ఏకంగా సదరు కాలేజీ ప్రిన్సిపాల్ స్వామినాథన్ దృష్టికి వెళ్లింది.
 
అంతే తమ కళాశాల విద్యార్థినులు మద్యం తాగడం కళాశాల నిబంధనలకు విరుద్ధమని, మందు పార్టీ ఇంట్లో చేసుకున్నా వారు కళాశాల యూనిఫాం ధరించి ఉన్నందున, దీనివల్ల కళాశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ప్రిన్సిపాల్ స్వామినాథన్ చెప్పారు. కళాశాల అమ్మాయిలు మద్యం తాగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కళాశాల యాజమాన్యం సదరు నలుగురిని తమ కళాశాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. తమ కళాశాల ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు మద్యం తాగిన నలుగురు అమ్మాయిలను కళాశాల నుంచి తొలగించామని భారతీదాసన్ యూనివర్శిటీ రిజిష్ట్రార్ గోపినాథ్ చెప్పారు.

ఇంతకీ వారంతా తమ కాలేజీ అమ్మాయిలేనని ప్రిన్సిపాల్ స్వామినాథన్ ఎలా గుర్తించాడని అడుగుతున్నారా.? అక్కడే వుంది అసలు కిటుకు. ఇక్కడి ఈ కాలేజీకి వున్న డ్రెస్ కోడ్ వీరిని అడ్డంగా బుక్ చేసింది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు కాలేజ్ ఎగ్గోట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేశారు. దీంతో కాలేజీ దుస్తుల్లో వారు మద్యం సేవించడంతో తమ కాలేజీ రెఫ్యూటేషన్ పాడవుతుందని ప్రిన్సిపాల్ చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశించారని వర్శిటీ రిజిష్ట్రార్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles