Telangana Serial Killer Arrested By Police ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్ అరెస్ట్

Telangana serial woman killer yerukala srinu arrested by police

Telangana Serial killer arrested, Yerukali Srinu, Salamma, Kallu compounds, Alivelamma, Mahabubnagar police, RangaReddy, Telangana, crime

Yerukala Srinu was arrested by the Mahabubnagar police as he was involved in the 17 murder cases. He targeted women who were drunkards and killed some women for their valuables. It is learnt that Srinu murdered atleast five women in 2007 and was arrested by police. His wife 38-year-old Salamma was also arrested by the police.

ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్ అరెస్ట్

Posted: 12/28/2019 06:53 PM IST
Telangana serial woman killer yerukala srinu arrested by police

ఒంటరి మహిళలు అందులోనే కాళ్లకు కడియాలు వున్న మహిళలే అతని టార్గెట్.. వారిని అత్యంత దారుణంగా హత్యచేసి వారి ఒంటి మీద వున్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని పరారయ్యే కరడుగట్టిన నేరగాడు. ఓ మధ్య వయస్సుగల మహిళ హత్యకేసు దర్యాప్తులో చిక్కిన ఈ సీరియల్ కిల్లర్ నేరాల చిట్టా విని పోలీసులే నివ్వెరపోయారు. అమాయకమైన ముఖంతో ఇంతమందిని నమ్మించి హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇతని చేతిలో హత్యకు గురైన వారు ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది మహిళలు.

ఇప్పుడు మీకు కూడా ఒళ్లు జలదరించింది కదూ. 16 మంది మహిళలను అన్యాయం బలితీసుకున్న ఈ దుర్మార్గుడు.. సొంత తమ్ముడిని కూడా హత్య చేశానని అంగీకరించాడు. తన నటనతో పోలీసులను బురుడీ కొట్టించి..జైలు నుంచి బయటకు వచ్చి.. మళ్లీ హత్యలను చేయడం.. అమాయక మహిళలను బలితీసుకోవడం ప్రవృత్తిగా పెట్టుకున్న ఈ నిందితుడు.. మిడ్జిల్, భూత్పూర్, దేవరకద్ర, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌..ఇలా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి హతమార్చాడు.

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ నరహంతకుడు..నవాబు పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ దారుణ హత్య కేసులో అనుమానాస్పదంగా వ్యవహరించడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. వెంటనే ఇతడిని పట్టుకుని విచారించారు. దర్యాప్తుల్లో షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. పలు ప్రాంతాల్లో మహిళలను దారుణంగా చంపింది ఇతనే అని నిర్ధారించారు. అతనే...మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను.

నేర చరిత్ర : -
2007లో సొంత తమ్ముడిని చంపేశాడు. దీంతో ఇతడిని పోలీసులు జైలుకు పంపారు. మంచిగా ఉంటా..బతుకుతా..అంటూ పరివర్తన కింద అప్పీల్ చేసుకున్నాడు. పాపం పోనీలే..అని మూడేళ్ల తరువాత బయటకు వదిలారు. కేవలం అతను నటించాడని పోలీసులకు తెలియదు. తనలో మార్పు రాలేదని మరలా హత్యలు చేయడం ప్రారంభించాడు. నగలు, ఆభరణాలు ధరించిన మహిళలను టార్గెట్ చేశాడు. కల్లు, మద్యాన్ని త్రాగించి..దారుణంగా చంపేశాడు. తనలో క్రూరత్వం ఇంకా చనిపోలేదని నిరూపించాడు. మరలా ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు.

జైలుకు వెళ్లి వచ్చినా : -
ఇతనిలో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ ప్రయత్నించింది. పెట్రోల్ బంకుల్లో పని చేయాలని సూచించారు. కానీ పనులకు సరిగ్గా హాజరు కాలేదు. దీంతో అతడిని విధుల నుంచి తొలగించారు. మరలా తనలో ఉన్న నటనను బయటకు తీశాడు. పోలీసు అధికారులను నమ్మబలికే విధంగా చేశాడు. చివరకు పెట్రోల్ బంకుల్లో పనికి కుదిరాడు. 2018 ఆగస్టులో జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు.

దిమ్మదిరిగే నేరాలు : -
ఈ క్రమంలో...డిసెంబర్ 16వ తేదీన మహబూబ్ నగర్‌లో అలివేలమ్మ దారుణ హత్యకు గురైంది. పోలీసుల విచారణలో ఎరుకుల శ్రీను పాత్ర ఉన్నట్లు తేల్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తాను..మంచిగా బతుకుతున్నానని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి ఇతని నటనను నమ్మలేదు. విచారించారు. దిమ్మదిరిగే నేరాలు ఒక్కోక్కటిగా బయటకు చెప్పాడు. ఏకంగా 16 మంది మహిళలను మట్టుబెట్టినట్లు ఒప్పుకున్నాడు. 2018 నుంచి నమోదైన కేసులు 4, పాతవి 14 కేసులు కలిపి ఇతనపై 18 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో 17 హత్యలు ఉన్నాయి.

* 2007 తుమ్మాజిపేట హత్య కేసులో జీవిత ఖైదు, సత్ప్రవర్తన కింద విడుదల
* 2007 బాలానగర్‌, నాగర్‌కర్నూల్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల పరిధిలో ఒక్కో కేసు
* 2007 జైలు నుంచి పారిపోయిన కేసు
* 2014 వంగూరు మర్డర్‌ కేసులో మూడేళ్ల జైలు శిక్ష
* 2014 షాద్‌నగర్‌, బాలానగర్‌ హత్య కేసుల్లో నిందితుడు
* 2015 శంషాబాద్‌ రూరల్‌ పీఎస్‌లో 3 కేసులు
* 2015 షాద్‌నగర్‌, కేశంపేట పీఎస్‌లలో ఒక్కో కేసు
* 2018 నాలుగు హత్య కేసుల్లో నిందితుడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles