collector sudden visit to Govt Hospital as common man ప్రభుత్వాసుపత్రి భాగోతాలు.. కలెక్టర్ అకస్మిక పర్యటనలో బట్టబయలు

Nizamabad district collector sudden visit to govt hospital as common man

narayan reddy, collector, nizamabad, district hospital, absentees, Doctors, Staff, DMO, sudden visit, canteen, mineral water, Telangana, Crime

The Nizamabad District collector Narayan Reddy gives a sudden suprise to doctors and staff of Government Hospital with sudden visit as common man

ITEMVIDEOS: ప్రభుత్వాసుపత్రి భాగోతాలు.. కలెక్టర్ అకస్మిక పర్యటనలో బట్టబయలు

Posted: 12/28/2019 12:30 PM IST
Nizamabad district collector sudden visit to govt hospital as common man

జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఎవరైనా ఎక్కడికైనా వస్తున్నారంటే ముందుగా సమాచారం వెళ్తుంది. సరిగ్గా చెప్పిన సమయానికి ఎంతొకొంత ఆలస్యంగా.. తమ మందిమార్భలం (అధికారులతో పాటు సెక్యూరిటీ) వెంటబెట్టుకుని వస్తుంటారు. అక్కడ ఎవరు ఎంచేస్తున్నారన్న విషయాలను పట్టించుకోకుండా.. తాము వచ్చిన పని మాత్రం చూసుకుని వెళ్తుంటారు. ఈలోగా అక్కడి సిబ్బంది వారి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమాలను శ్రీకరించడం.. సహా మిగత పనులు చకచక చేసుకని మమ అనిపించుకుంటారు.

అయితే ఇందుకు భిన్నంగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను సామాన్యుడిలా పరిశీలించిన నిజమాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.. తాను జిల్లా కలెక్టర్ ను అని చెప్పుకునేంత వరకు తాను చెప్పిన పనిని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. అంతేకాదు.. కలెక్టర్ అకస్మిక తనిఖీలో ఏకంగా సగానికి పైగా సిబ్బంది గైర్హాజరైన విషయం కూడా బట్టబయలైంది. దీనికి తోడు అస్పత్రి రోగులను టార్గెట్ గా చేసుకుని దోపిడికి తెరతీసిన క్యాంటిన్ వర్కర్ పై క్రిమినల్ చర్యలను చేపట్టాలని ఆయన అదేశాలు జారీ చేశారు. ఇక అసుపత్రిని సిబ్బంది రోజు ఎన్ని పర్యాయాలు శుభ్రం చేస్తున్నారన్న వివరాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

జిల్లాకు చెందిన పేద ప్రజలు డబ్బులు పెట్టి ప్రైవేటు అసుపత్రులను ఆశ్రయించి వైద్యం చేయించుకోలేని పరిస్థిత్తుల్లో ప్రభుత్వ అసుపత్రులను ఆశ్రయిస్తున్నారని.. అలాంటి రోగులను ఆదరించి వారికి చికిత్సను అందుబాటులో ఉండేలా వైద్యులు వ్యవహరించాలని.. అందుకు బదులు ఇవేం ప్రభుత్వ అసుపత్రులు రా దేవుడా అనేట్లు ఉండకూడదని ఆయన వైద్యులకు సూచించారు. తనకు వైద్యం అందడం లేదని ఓ రోగి.. తీవ్ర అవస్థకు గురవుతున్నా.. సదరు రోగిని వైద్యులు కానీ.. నార్సింగ్ స్టాప్ కానీ పట్టించుకోకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇలా ఎందుకన్నారంటే..

కలెక్టర్ అకస్మిక తనిఖీలో ఒక్కరోజులో అసుపత్రికి చెందిన ఎన్ని బాగోతాలు బయటపడ్డాయో.. మరి ఇలా అన్ని శాఖలకు చెందిన అధికారులు సామాన్యుడిలా పర్యటనలు చేస్తే ఇంకెనెన్ని.. ఎందరెందరి చరిత్రలు బయటపడతాయోమరి.. హ్యాట్సాఫ్ కలెక్టర్ సార్.. అని అంటున్నారు విషయం తెలిసిన ప్రజలు మా జిల్లాకు ఇలాంటి అధికారి కావాలని మరీ మరీ కోరుతున్నారు. సాధారణ వ్యక్తిలో సైకిల్ పై జిల్లా ఆస్పత్రికి వచ్చిన ఆయన అక్కడి రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్య సేవల తీరుపై ఆరాతీశారు. ఓ రోగిని ఎవరూ పట్టించుకోకుంటే అతడికి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు.

ఆయన మాటలను అక్కడి వైద్యులు పట్టించుకోలేదు. చివరకు తాను జిల్లా కలెక్టర్ అని చెప్పడంతో... వైద్యులంతా కంగారు పడిపోయారు. అప్పటి వరకు నిర్లక్ష్యంగా ఏదో పనిలో నిమగ్నమైనట్టుగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బంది కాస్తా.. ఉరుకులు పరుగులు పెడుతూ.. ప్రైవేటు అస్పత్రులలో ఎమర్జెన్సీని సమయంలో వ్యవహరించిన తీరును ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ ఒక్క రోజు అకస్మిక పర్యటనలోనే అసుపత్రిలోని ఎన్నో లొసుగులు, బాగోతాలు భయటపడ్డాయి.

ఇలా అందరూ వ్యవహరిస్తే.. స్వచ్ఛ భారత్, సేవా గుణం, అవినీతి రహిత సమాజం అవిష్కృతం కావడం ఖాయమని ప్రజలు వ్యాఖ్యానిస్తూ కలెక్టర్ ను ప్రశసింస్తున్నారు. ఇక ఈ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ గురించి.. మందీ మార్భలం లేకుండా ఆయన వచ్చిన తీరు గురించి తెలిసిన పలు జిల్లాల ప్రజలు ఆయన లాంటి వ్యక్తి తమ జిల్లాకు కలెక్టరుగా రావాలని కోరుతున్నారు. ఇలాంటి అధికారులు వుంటే జిల్లా మొత్తం అలర్టుగా వుంటుందని కొనియాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh