Chidambaram attacks BJP after Jharkhand results జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై చిదంబరం 'త్రీడీ' సెటైర్

3d chidambaram sums up bjp s 2019 story in nine words after jharkhand verdict

chidambaram, 3D sattire, Jharkhand election results, Jharkhand election results 2019, Jharkhand elections 2019, congress-JMM, BJP, Hemanth soren, Mahagathbandhan, Jharkhand Polls, Jharkhand Polls Results, Jharkhand BJP, Tejashwi Yadav, Jharkhand, Politics

As the BJP is faced with an imminent defeat in Jharkhand, senior Congress leader P Chidambaram took a jibe at the saffron party and pointed to party's poor performance in assembly polls like Haryana, Maharashtra and Jharkhand.

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై చిదంబరం 'త్రీడీ' సెటైర్

Posted: 12/24/2019 10:29 AM IST
3d chidambaram sums up bjp s 2019 story in nine words after jharkhand verdict

జార్ఖాండ్ ఎన్నికల్లో మహాకూటమికి అనుకూలంగా తీర్పునిచ్చిన ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా పడిపోతుందనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అన్నారు. బీజేపీపై మూడు 'డీ'లతో కూడిన 'త్రీడీ' సెటైర్ విసిరారు. డెంటెడ్, డినైడ్, డిఫీటెడ్ ( దెబ్బతినింది, వద్దనుపించుకుంది, ఓడిపోయింది) అనే పదాలను చిదంబరం ప్రయోగిస్తూ చేసిన సెటైర్ హల్ చల్ చేస్తోంది.

'హర్యానాలో దెబ్బతిన్నారు (డెంటెండ్), మహారాష్ట్రాలో వద్దనిపించుకున్నారు (డినైడ్), జార్ఖాండ్‌లో ఓడిపోయారు (డిఫీటెడ్) ' అంటూ చిదంబరం ట్వీట్ చేశారు. జార్ఖాండ్‌లో ఇంత ఘనవిజయం అధించిన ప్రజలకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 'హర్యానాలో వాళ్లు (బీజేపీ) కొద్దిపాటి లీడింగ్‌తో గెలిచారు. మహారాష్ట్రలో దొడ్డిదారిన అధికారం దక్కించుకోవాలని ప్రయత్నించారు. కానీ క్రమంగా వాళ్లు కిందకు జారిపోతూనే ఉన్నారు' అని చిదంబరం బీజేపీపై సెటైర్ వేశారు.

ఇక జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి పార్టీలకు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన అధికత్యను అందించడంతో.. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన బీజేపిపై విమర్శనాస్త్రాలను సంధించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఓడిపోయారంటూ.. క్రమంగా దేశవ్యాప్తంగా మీ గ్రాఫ్ పడిపోతుందని ఆయన చురకలంటించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి అవసరమైన 41 సీట్లను జేఎఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి దాసేంది. 47 సీట్లను కైవసం చేసుకుంది, (జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1). కాగా అధికార బీజేపి కేవలం 25 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, జేవీఎం 3, ఏజేఎస్యూ 2, సీపీఐ 1, ఎన్సీపీ 1, స్వతంత్రులకు 2 సీట్లు దక్కాయి.

తండ్రికి విజయాన్ని అంకితమిచ్చిన హేమంత్ సోరెన్

జేఎంఎం-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు జేఎంఎం నేత, కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ విజయం ఒక మైలురాయి అని అన్నారు. ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలని అన్నారు. ఈ విజయాన్ని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కు అంకితం చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌, ఇతర నేతలందరికీ తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
 
'దిషోం గురు శిబు సోరెన్ చేసిన కఠోర శ్రమ, పోరాటం ఫలితమే ఈ విజయం. రాష్ట్రం ముందున్న లక్ష్యాలను సాధించుకునే సమయమిది. జార్ఖండ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ విజయం ఓ మైలురాయి. సమాజంలో వర్గాలు, కులాలకు అతీతంగా అందరి అంచనాలు, కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నాను. దీనిపై త్వరలోనే భాగస్వామ్య పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తాను' అని హేమంత్ సోరెన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles