Minor girl gang-raped in Kumaram Bheem Asifabad బాలికపై అఘాయిత్యం.. ఆపై మరో దారుణం..

Minor girl gang raped in kumaram bheem asifabad

Rape, Gangrape, RMP Doctor, 14-year-old minor girl, Relatives, Atram Prabhu, Penduri Srikanth, Parents, Shekuguda, Jainur police station, Asifabad, Kumaram Bheem districts, Telangana, Crime

In a brutal incident, a 14-year-old minor girl was gang-raped by two persons of the same village, Shekuguda. The incident came into light after the victim's family members complained at Jainur police station. Police filed a case and arrested the accused Atram Prabhu, Penduri Srikanth and RMP doctor.

ITEMVIDEOS: : (రా)బంధువులే.. బాలికపై అఘాయిత్యం.. ఆపై మరో దారుణం..

Posted: 12/19/2019 12:29 PM IST
Minor girl gang raped in kumaram bheem asifabad

తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ మైనర్ బాలికను బంధువలే రాబంధులై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో అన్ని తామే అయ్యి అమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బంధువులే.. అమెపై ఫైశాచిక మృగాళ్ల మాదిరిగా వ్యవహరించారు. అయితే ఇలా గత కొన్ని నెలలుగా అమెను లొబర్చుకుని పదే పదే పాడుపనికి పాల్పడటంతో అమె గర్భం దాల్చింది. దీంతో ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా స్థానికుడైన ఓ అర్ఎంపీ డాక్టరు చేత అమెకు గర్భస్రావం కూడా చేయించారు.

బాలిక కడుపునోప్పితో బాధపడటంతో అమె సోదరుడు విషయాన్ని తమ బంధువులకు చెప్పాడు. వారు బాలికను వాకాబు చేసి.. జరిగిన విషయాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులు ఆత్రం ప్రభుతతో పాటు పెందూరు శ్రీకాంత్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాలికకు చట్టవిరుద్దంగా గర్భస్రావం చేసిన అర్ఎంపీ వైద్యుడిని కూడా అరెస్టు చేసిన కటకటాల వెనక్కి పంపారు.

కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులుగా తల్లిదండ్రులు లేని బాలిక క్షేమం కోరాల్సిన వారే.. కామంతో అఘాయిత్యానికి తెగబడిన ఈ దారుణ ఘటన కుమ్రం భీం జిల్లా జైనూరు మండలం షేక్ గూడలో జరిగింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిపై పోస్కో చట్టం కింద కేసును నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles