38percent govt hospitals don't have staff toilets స్వచ్ఛాభారత్: 38శాతం ప్రభుత్వాసుపత్రుల్లో టాయ్ లెట్లు కరువు..

4 yrs of swachh bharat but 38percent govt hospitals don t have staff toilets

Rural India, Swachh Bharat, Rural health, rural health in India, Rural health infrastructure in India, Rural health status in India, Rural hospitals in India, toilets in govt hospitals, toilets in rural hospitals, health infrastructure rural hospitals, staff toilets govt hospitals, Politics

while the government may pat its back with its claims of constructing over 9.5 crore toilets across India since 2014, but, the latest data on rural health infrastructure reveals that 38 per cent government health centres in rural India don't have toilets for their staff.

స్వచ్ఛాభారత్: 38శాతం ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బందికి మరుగుదొడ్లు కరువు..

Posted: 12/17/2019 06:28 PM IST
4 yrs of swachh bharat but 38percent govt hospitals don t have staff toilets

ప్రభుత్వ పథకాల తీరు పరిశీలిస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న నానుడి గుర్తికురాక తప్పదు. యావత్ దేశంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ.. నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛా భారత్ కార్యక్రమంలో ప్రచారం ఎంతో గొప్పగా ఉన్నా.. అపరిశుభ్రత మాత్రం తొలగిపోలేదని దేశంలోని పలు నగరాలు, పట్టాణల్లో వాతావరణం అద్దం పడుతొంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, పురపాలక సంఘాలతో కాస్తోకూస్తే ప్రగతి మాత్రం కనిపిస్తోందని మాత్రం చెప్పకతప్పదు. అయితే ఈ పథకంలో భాగంగా వెచ్చిస్తున్న నిధులు.. కనబడుతున్న శుభ్రతకు ఎంతమాత్రం సరిపోల్చలేం.

పట్టణాలు, నగరాల విషయాన్ని పక్కనబెడితే.. గ్రామీణ భారతంలో మాత్రం పరిస్థితి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వుందని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. స్వచ్ఛభారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఏకంగా 9.5 కోట్ల మరుగుదోడ్ల నిర్మాణం జరిగిందని కేంద్ర ప్రభుత్వం గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా గ్రామీణ భారతంలో ఇప్పటికీ 38శాతం ప్రభుత్వాసుపత్రులకు మరుగుదొడ్లు లేవని తాజా సర్వేలో వివరాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వున్న ఏకంగా 72వేల ప్రభుత్వాసుపత్రులలో రోగులకే కాదు కనీసం ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి కూడా టాయ్ లెట్లు లేవని ఇండియా టుడే సర్వే గణంకాలను తెలుపుతున్నాయి.

అంతేకాదు ఏకంగా 40 వేల ప్రభుత్వాసుపత్రులు కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ఇంకా గుడ్డి దీపాల కాంతుల్లో వున్నాయని వెల్లడైంది. స్వచ్ఛా భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించే క్రమంలో ప్రధాని మోదీ గ్రామీణ భారతంలో సుమారు 60 శాతం మంది ప్రజలు బహిరంగంగానే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారని, ఇది దేశ గౌరవానికే భంగం కలింగించేలా వుందని అన్నారు. ఇక అప్పటి నుంచి స్వచ్ఛా భారత్ కార్యక్రమంలో భాగంగా 9.5 కోట్ల మరుగుదోడ్లను నిర్మంచారు. అయినా దేశంలో ఇంకా యాభై శాతం ప్రభుత్వ ప్రజారోగ్య కేంద్రాల్లో సిబ్బందికి కూడా మరుగుదొడ్లు లేవని తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సంఖ్య మరీ ముఖ్యంగా తెలంగాణలో అధికంగా వుందని వెల్లడైంది. అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తోందని.. ప్రగతిపథంలో తమకు తామే సాటి అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఫ్రభుత్వం.. గ్రామీణ తెలంగాణలోని ప్రజారోగ్య కేంద్రాల్లో సిబ్బందికి కూడా మరుగుదొడ్లు లేని దుస్థితిలో వుందని.. కేంద్రం వెల్లడించిన గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఆతరువాతి స్థానంలో రాజస్థాన్.. ఆ తరువాత స్వయంగా ప్రధాని మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ వుంది. ముఖ్యమంత్రిగా ఏకంగా హ్యాట్రిక్ సాధించిన ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలోనూ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడం.. కొసమెరుపు.

ఇక ఆ తరువాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రతీ ప్రభుత్వ అసుపత్రిలో సిబ్బందికి మరుగుదొడ్లు వున్నాయి. అనేక అసుపత్రుల్లో సిబ్బందికి, రోగులకు వేర్వేరుగా టాయ్ లెట్స్ వున్నాయి. అయితే ఇక దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా వున్న ఉత్తర్ ప్రదేశ్ లోనూ అన్ని అసుపత్రుల్లో సిబ్బందికి మరుగుదొడ్లు వున్నాయి. కేవలం తొమ్మిది శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతంలోని అరోగ్య కేంద్రాల్లో మరుగుదొడ్ల లేవని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రాజస్తాన్ లో 85శాతం.. గుజరాత్ లో 73 శాతం గ్రామీణ సబ్ సెంట్లర్లలో మరుగుదొడ్లు లేవని సర్వే తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles