Actors, minister's kin in Hirakud dam controversy అగ్గిరాజేసిన అమాత్య తనయ ఫోటోలు.. వీడియోలు..

Odisha minister s kin actors shoot in restricted hirakud area

Nabakishore Das, actress Prakruti Mishra, actress Elina Samantray, fashion designer, Loveena Nayak, River Mahanadi, Odisha, Hirakud reservoir, actresses shoot video, daughter of Odisha health minister, social media, viral video, video viral, Crime

The daughter of Health Minister Naba Kishore Das has sparked a controversy after a video of her along with three Odia film actresses frolicking in the highly restricted zone of Hirakud Dam went viral on social media.

అగ్గిరాజేసిన అమాత్య తనయ ఫోటోలు.. వీడియోలు..

Posted: 12/17/2019 06:25 PM IST
Odisha minister s kin actors shoot in restricted hirakud area

అమాత్య తనయ దిగిన ఫోటోలు, వీడియోలు తన సామాజిక మాద్యమంలో పోస్టు చేయడంతో అవి కాస్తా ఒడిషాతో పాటు యావత్ దేశవ్యాప్తంగా నెట్టింట్లో అగ్గిరాజేస్తున్నాయి. అమె దిగిన ఫోటోలు కానీ అమెతో వెళ్లిన ఇద్దరు నటీమణులు కూడా ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండానే వ్యవహరించినా.. ఎందుకని అమె ఫోటోలు అగ్గిరాజేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా..? తాము సెలబ్రిటీలమని ఇద్దరు నటీమణులతో పాటు తాను అమాత్యుని కూతుర్నినని మంత్రి తనయ ఏకంగా హద్దులు దాటి నిషిధ్ద ప్రాంతంలో ఫోటోలు దిగారు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు అందరికీ వర్తిస్తాయన్న విషయం తెలిసినా.. తాను మంత్రి కూతుర్ని తనకు రూల్స్, గీల్స్ వర్తించవని భావించినట్లుందీ ఒడిషా ఆరోగ్యశాఖ మంత్రి నభా కిషోర్ దాస్.. తనయ దీపాలి దాస్.. తన స్నేహితురాళ్లైన నటీమణులు పకృతి మిశ్రా, ఎలినా సమంత్రేలతో కలసి ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంబాల్ పూర్ వెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో మహానందీ నదిపై నిర్మితమైన హిరాకూడ్ డ్యామ్ ను సందర్శించారు. తమతో పాటు అమె తన వెంట ఒక ఫ్యాషన్ డిజైనర్ లొవినా నాయక్ ను కూడా తీసుకుని వెళ్లింది.

ఇంతవరకు బాగానే వున్నా డ్యామ్ పై నిషిద్ద ప్రాంతానికి వీరు వెళ్లడం.. అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకుంది. అయినా ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కోని అమె.. అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే అవి ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి. వైరల్ కావడానికి కారణం అవి నిషిద్ద ప్రాంతంలో దిగినవి కావడమే. అంతే పనిలో పనిగా ఒక్కసారిగా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మంత్రి కూతురైనంత మాత్రన అమె నిషిద్ద ప్రాంతంలోకి ఎలా వెళ్లి ఫోటోలు దిగగలుగుతుందని.. అక్కడి అధికారులు ఏం చేస్తున్నారని నెటిజనులు ప్రశ్నించారు.

ఇలా ఒకటి రెండు కాదు.. అనేక విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి కుమార్తెకు అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారులు నిషిద్ద ప్రాంతానికి ఎలా వెళ్లనిచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన పోలీసులు ఒడిశా ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ను దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వివాదంపై మంత్రి నబ కిశోర్‌ దాస్‌ స్పందించారు. తన కుమార్తె మైనర్‌ కాదని, ఆమె తరఫున మాట్లాడబోనని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అటు హీరోయిన్లు ప్రకృతి, ఎలినా కూడా స్పందిస్తూ.. ఇలాంటి పొరబాట్లు మరోసారి చేయబోమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles