Ayesha Mother Makes Key comments on MLA Roja ‘‘అయేషా మీరా కేసులో నిందితులెవరో రోజాకు తెలుసు.!’’

Ayesha case deceased mother key remarks on ycp mla

Ayesha Meera, Ayesha Meera case, Shamshad Begum, Roja, Ayesha case Accused, Ayesha Meera updates, Ayesha Meera case news, Ayesha Meera CBI, CBI in Ayesha Meera case, CBI about Ayesha Meera,Andhra Pradesh, Politics, Crime

vijayawada ibrahimpatnam B.Pharmacy student Ayesha meera death in college hostel is a mysterous death even today after 12 years of the incident. Ayesha mother shashad begum makes sensational comments on YCP MLA Roja in connection to this case.

‘‘అయేషా మీరా కేసులో నిందితులెవరో రోజాకు తెలుసు.!’’

Posted: 12/14/2019 11:53 AM IST
Ayesha case deceased mother key remarks on ycp mla

విజయవాడ ఆయేషా మీరా దారుణహత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. పుష్కరకాలం నిండిన ఈ కేసులో ఇప్పటికీ అసలైన నిందితులను పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో ఈ కేసు విచారణను సిబిఐకి రాష్ట్రోన్నత న్యాయస్థానం అప్పగించింది. అనేక మలుపులు, ట్విస్టులు తిరిగిన ఈ కేసులో చివరకు న్యాయస్థానంలో భద్రంగా వుండాల్సిన ఆధారాలు కూడా కనుమరుగు కావడంతో.. ఈ కేసును పునఃధర్యాప్తు  చేయాలని హైకోర్టు సిబిఐకి కేసును అప్పగించింది.

కాగా, ఈ కేసులోని మృతురాలు అయేషా మీరా తల్లి షంషాద్‌ బేగం అధికార పక్షానికి చెందని మహిళా ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు నిందితులు ఎవరో తెలుసునని అమె అరోపించారు. అయేషా మీరా హత్య జరిగినప్పుడు తమకు మద్దతుగా నిలిచిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని షంషాద్‌ బేగం నిలదీసారు. నాడు తమ పక్షాన నిలబడి పోరాడిన రోజా.. ఇప్పుడు అసలు స్పందించటం లేదన్నారు. తాము తొలి నుండి ఆరోపిస్తున్నట్లుగా హత్యకు కారకులు ఎవరో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేసారు.

ఒక వర్గం వారి పైన దాడులు జరిగితేనే స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆయేషా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసారు. రీపోస్టుమార్టం తమ మత ఆచారాలకు విరుద్ధమని... అయినప్పటికీ కేసు విచారణ ముందుకు సాగేందుకు రీపోస్టుమార్టంకు ఒప్పుకున్నామన్నారు. తమ కుమార్తె హత్య కేసులో దోషులకు శిక్ష పడాలనే ఇందుకు అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని బేగం ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.

2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా వున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayesha Meera  Shamshad Begum  Roja  Ayesha case Accused  Satyam babu  Guntur  Andhra Pradesh  Politics  Crime  

Other Articles