AP Govt gives clarity on Capital ఏపీ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

Ys jagan government gives clarity on andhra pradesh new capital

Amaravati, YS Jagan Mohan Reddy, Botsa Satyanarayana, Legislative Council, Telugu Desam Party, Ashok Babu, YSRC, Andhra Pradesh, Politics

The Andhra Pradesh government on Friday categorically said there was no proposal to change the state capital from Amaravati, an assertion that could possibly put an end to uncertainty and speculation on the issue for over six months now.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

Posted: 12/13/2019 09:00 PM IST
Ys jagan government gives clarity on andhra pradesh new capital

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతిని రాజధానిగా కొనసాగించే అవకాశాలు లేవని మంత్రి బొత్స సత్యానారాయణతో పాటు పలువురు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని మారుతుందన్న విషయమై ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు అటు అమరావతి రైతుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు కేంద్రం జారీ చేసిన భారత దేశ పఠంలోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగానే వుండటంతో అందోళన నెలకొంది. అయితే ఆ తరువాత కేంద్రం జారీ చేసిన రెండో పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించింది. దీంతో కొంత క్లారిటీ వచ్చినా.. ఇంకా కొంత సంధిగ్ధం మాత్రం నెలకొంది.

అయితే తాజాగా దీనిపై జగన్ సర్కార్ క్లారిటి ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి సభ్యురాలు శమంతక మణి అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని దీనిలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో గత కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. దీని పై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

గతంలో కూడా బొత్స రాజధాని పై ప్రకటనలు చేశారు. అయితే ఇటీవల జరిగిన సమావేశాల్లో రాజధాని ప్రాంంతంలో పెండింగ్ పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో మంత్రి బొత్స శాసనమండలిలో ప్రకటన చేయడంతో రాజధాని అమరావతే అని స్పష్టమైతుంది. ఇది ప్రభుత్వం అధికారికంగా చెప్పిన ప్రకటనగానే భావించవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల రాజధాని పెండింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అమరావతే రాజధాని అని తేలడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Tension prevails in amaravati as ap cabinet apporves three capitals

  అట్టుడుకుతోన్న అమరావతి.. భారీగా పోలీసుల మోహరింపు

  Jan 20 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయ ప్రాంత రైతులు చేస్తున్న అందోళనలు, నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో క్యాబినెట్ భేటి, ప్రత్యేక అసెంబ్లీకి ఏర్పాటు క్రమంలో... Read more

 • Chandrababu says today is black day on ap cabinet approving three capitals

  మూడు రాజధానుల ఆమోదం: చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణన

  Jan 20 | అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదన మూర్ఖపు నిర్ణయమి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.... Read more

 • Andhra pradesh government approves high power committee report

  హై-పవర్ కమిటీ నివేదికను అమోదించిన క్యాబినేట్

  Jan 20 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను వికేంద్రీకరించి రాష్ట్రంపై తనదైన ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతుల నిరసనలు, ఆందోళనలను కూడా విస్మరించిన ఆయన ఇవాళ అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్... Read more

 • Nims doctor meena kumari dies after cardiac arrest in london in medical conference

  గుండెపోటుతో నిమ్స్ వైద్యురాలు మీనాకుమారీ మృతి

  Jan 18 | లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురైన నిమ్స్ డాక్టర్ మీనా కుమారి మృతి చెందారు. ఆమెను కాపాడటానికి లండన్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన మీనాకుమారిని... Read more

 • Actor shabana azmi injured in car accident on mumbai pune expressway

  రోడ్డు ప్రమాదంలో సీనియర్ నటి ఆజ్మీకి తీవ్రగాయాలు..

  Jan 18 | బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఆమెకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ముంబై నుంచి పుణె కు వెళ్తున్న అమె... Read more

Today on Telugu Wishesh