Three days Jail for smoking in public place పోగరాయుళ్లకు చేధువార్త: పబ్లిక్ గా తాగితే.. ఇక జైలుకే..!

Be alert three days jail for smoking in public place

smokers, public places, cigeratte, jail, police, Judicial remand, Hyderabad, Telangana, Crime

Be Alert Smokers, In Hyderabad smoking in public place places you behind the bars. Yes it is a crime to smoke in Public place in Telangana. Police are taking string action on smokers.

పోగరాయుళ్లకు చేధువార్త: పబ్లిక్ గా తాగితే.. ఇక జైలుకే..!

Posted: 12/13/2019 04:37 PM IST
Be alert three days jail for smoking in public place

పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం... మీతో పాటు మీ పక్కనున్న వారికీ కూడా హానికరమే. కొన్నేళ్లుగా ఈ వ్యాఖ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ.. కనిపిస్తోంది. ధూమపానరాయుళ్లు మాత్రం ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లను కాల్చి.. వారి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఇక నిన్నమొన్నటి రవకు ఇలాంటి వ్యాఖ్యాలు ఎక్కడ కనబడినా వాటిని కామెడీగా చెరిపేసి.. లేదా అర్థాన్ని మార్చేసి.. జోక్ గా తీసుకునేవారు. ఇక సినిమా ధియేటర్లలో ఈ హెడ్ లైన్ కొంచెం హై లెట్ చేసినా.. ఎవరు పట్టించుకోవడం లేదు. సినిమాలో పాటు ఎప్పుడు మొదలైనా.. బయటకు పరుగులు తీసే పోగరాయుళ్లు.. పాట పూర్తయ్యే సమయానికి సిగరెట్ ఊదేసి లోనికి వచ్చేయడం కూడా మనం గమనిస్తువుంటాం.

ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నేరమని.. ఇలా చేసిన వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే అప్పట్లో దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే క్రమంలో పోలీసులు ఈ చట్టాన్ని ధూమపానప్రియులకు పరిచయం చేస్తున్నారు. ఎంతగా దీనిపై శ్రద్ద పెట్టినప్పటికీ ఇంకా చాలామంది నిసిగ్గుగా రోడ్లపై సిగరెట్లు తాగడం మానడం లేదు. తాజాగా రోడ్డుపై సిగరెట్ తాగేవారిపై స్థానికులు కూడా కన్నెర చేస్తున్నారు. దీంతో వారు కటకటాలు లెక్కించాల్సి వస్తోంది.

భహిరంగ ప్రదేశాల లో మద్యపానం చేయడం ఎంతటి నేరమో.. అలాగే ధూమపానం చేసినా అదీ నేరమే. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా మేడిపల్లి ఎన్ఐఎన్ కాలనీకి చెందిన బాలదీపక్ అనే వ్యక్తి రాత్రివేళ  ఆరు బయట హాయిగా సిగరెట్ తాగాడు. దీనితో ఆ కాలనీ వాసులు పెట్రోలింగ్ పోలీసులు కంప్లయింట్ ఇచ్చారు. దీనితో అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఆరు బయట సిగరెట్ తాగే వ్యక్తిని  అరెస్ట్ చేసి.. ఎల్బీ నగర్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్  తాగినందుకు ఆ వ్యక్తికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. గతంలో రూ.50 చొప్పున పడిన జరిమానా కాస్తా ఏకంగా మూడు రోజుల జైలు శిక్షగా మారింది. సో.. ధూమపాన ప్రియులు బీ అలర్ట్..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smokers  public places  cigeratte  jail  police  Judicial remand  Hyderabad  Telangana  Crime  

Other Articles