woman officer apologise for calling Ahmedis as people దేవుడా.! ఐక్యంగా కలిసివుండాలంటే.. ఇలానా..

Students force woman officer to apologise for calling ahmedis as people

Pakistan, minority rights, Ahmadias in Pakistan, non-Muslims in Pakistan, Assistant Commissioner, Jannat Hussain Nekokara, Attock, Apology, Pakistan

Attock Assistant Commissioner Jannat Hussain Nekokara was forced to apologise for her comments in support of equal rights for minorities. The students also made her say that her son was not a Muslim as he was an Ahmadi.

దేవుడా.! ఐక్యంగా కలిసివుండాలంటే.. ఇలానా..

Posted: 12/13/2019 12:04 PM IST
Students force woman officer to apologise for calling ahmedis as people

మనుషులంతా ఒక్కటే.. అందరూ ఐక్యంగా కలసి వుండాలంటే పేచీ ఎక్కడ వస్తుంది. దేవుడు కూడా ఒక్కడే.. ఆయన రూపాలే అనేకం.. ఎవరికి నచ్చిన రూపంలో వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు అంటే ఎవరు మాత్రం కాదంటారు. కానీ ఈ వ్యాఖ్యాలు మహానేరం అయినట్టు.. ఆక్కడి విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులు.. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఏకంగా అసిస్టెంట్ కమీషనర్ నే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు అమె కోడుకు ముస్లిం కాదని అంగీకరించాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు. అంతేకాదు.. వాళ్లను నాస్తికులని ఓప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

అంతర్జాతీయ మానవహక్కుల రోజున పాకిస్తాన్ మహిళా అడ్మినిస్ట్రేటివ్ అధికారి మాట్లాడిన ప్రసంగాన్ని అక్కడి విద్యార్థులు తప్పబట్టారు. అమె పట్ల దురుసుగా ప్రవర్తించిన విద్యార్థులు.. అసభ్యకర వ్యాఖ్యాలు చేశారు. అందరం ఐక్యంగా కలసి మెలసి వుండాలన్న పాపానికి.. ఆమె కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి క్షమాపణ చెప్పాలంటూ దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనకు దారితీసిన పరిణామాల పూర్వపరాల్లోకి వెళ్తే.. డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అటాక్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జన్నత్‌ హుస్సేన్‌ నెకోకరా జిల్లా పాలనావిభాగం కార్యాలయంలో ప్రసంగించారు.

‘ముస్లింమేతర పాకిస్తానీయులకు కూడా సమాన హక్కులు కల్పించాలి. మత పరమైన విభేదాలతో మన మధ్య విభజన రేఖలు ఏర్పరచుకున్నాం. షియా, సున్నీ, అహ్మదీ, వహాబీ అంటూ అంతరాలు సృష్టించుకున్నాం. మనమంతా ముస్లింలమే అని... అంతకుమించి పాకిస్తానీయులమని గుర్తించాల్సిన అవసరం ఉంది’ అని జన్నత్‌ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ అటాక్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. అహ్మదీలను ముస్లింలుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అధికారిని ప్రయత్నించగా.. ‘ నీ కొడుకు కాఫిర్‌(ముస్లింమేతరుడు).. అని అంగీకరించాలని ఒత్తడి తీసుకువచ్చారు.

ఇక విద్యార్థుల ప్రవర్తనతో తానే వెనక్కి తగ్గిన జన్నత్‌ చివరకు క్షమాపణ చెప్పారు. ‘నేను ముస్లింమేతర పాకిస్తానీ, మైనార్టీల మానవ హక్కుల గురించి మాట్లాడాను. అసలు అహ్మది అనే పదం ఉపయోగించానో కూడా గుర్తులేదు. వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో అలా మాట్లాడాను. అంతర్గతంగా మనమందరం సంఘటితంగా ఉన్నపుడే బయటి శత్రువును ఎదుర్కోగలం అనేది నా ఉద్దేశం అని వివరణ ఇచ్చారు. ‘అవును పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం అహ్మదీలు ముస్లింమేతరులు. నా దృష్టిలో కూడా సరేనా. మీరన్నట్లుగా నా కొడుకు ముస్లింమేతరుడే. వాడో కాఫిర్‌’ అని అన్నారు. ఇలా అమె అన్న వ్యాఖ్యలను సెల్ ఫోన్ లో రికార్డు చేసిన విద్యార్థులు దానిని నెట్టింట్లో అప్ లోడ్ చేయగా, అకి కాస్తా వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh