Pawan Kalyan ends his day long fast రైతు కన్నీరు భూమిన ఇంకితే భూకంపమే: పవన్ కల్యాణ్

Jana sena chief pawan kalyan ends his day long fast in kakinada

Pawan Kalyan, JanaSena, Nagababu, Nadendla Manohar, Pantam Nanaji, Rythu Soubhagya Deeksha, Kakinada, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Religion, caste, Chirstianity, HInduism, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

The Jana Sena chief Pawan Kalyan has ended his day long fast at JNTU in Kakinada in protest to government's incompetence of solving farmer's problems in the state. He ended up his fast 8 pm. Pawan was accompanied by his brother Nagababu and Jana Sena leader Nadendla Manohar.

రైతు కన్నీరు భూమిన ఇంకితే భూకంపమే: పవన్ కల్యాణ్

Posted: 12/12/2019 10:26 PM IST
Jana sena chief pawan kalyan ends his day long fast in kakinada

‘చెట్టుగానైనా ఉండి ఉంటే.. ఏడాదికో వసంతమైనా దక్కేది.. కానీ రైతుగా పుట్టడం.. మాత్రం శాపం కూకూడదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఏడాది పొడవునా కష్టాలు పడే రైతులకు సెలవు లేదు.. ఊరట లేదు.. ఇది కొనసాగితే రైతు అనేవాడే కనబడడని ఆయన అందోళన వ్యక్తం చేశారు. రైతు కన్నీరు పెట్టే నేల పాలకులకు శాపం అవుతుంది. రైతు కన్నీరు భూమి మీద పడితే భూకంపం వస్తుందన్నారు. సూట్ కేసు కంపెనీలు పెట్టిన మీరు (పరోక్షంగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ) ఈ స్థాయిలో ఉంటే.. కష్టపడి పని చేసే రైతు తానెందుకు అలాగే వుండాలన్న అలోచన వచ్చినప్పుడల్లా.. అన్నదాత కడుపు మండిపోతోందని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన పది రోజులకే ప్రజావేదికతో కూల్చివేతలను మొదలుపెట్టిందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులను కూల్చివేశారే... ఇప్పుడు రైతులను కూల్చివేస్తున్నారు. ఇంకా ఎందర్ని కూల్చివేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో మీరు కూడా కూలిపోతారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం పట్ల భారీ స్థాయిలో వ్యతిరేకత పెరిగిందన్న పవన్.. వైసీపీ నేతలు చేజేతులా ఇలా చేసుకున్నారన్నారు. ఈ దేశం ఎంతో మంది నేతలను చూసిందని.. ఎంతవారైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని అన్నారు. ఓటమితో ఎవరికైనా ఆత్మస్థయిర్యం దెబ్బతింటుంది. కానీ పవన్ కల్యాణ్ కు కాదన్నారు.

జనసేన ఆధ్వర్యంలో కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష పేరిట దీక్షను చేపట్టిన పవన్ కల్యాణ్ రాత్రి ఎనమిది గంటలకు సరిగ్గా 12 గంటలు గడిచిన తరువాత దీక్షను విరమించారు. స్థానిక రైతులు పలువురు పవన్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోటు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపి శాసన సభ సమావేశాలను ప్రారంభించాలన్న సంస్కారం కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ‘లాంగ్ మార్చ్ సందర్భంగా.. తాము మరణించిన భవన నిర్మాణ కార్మికులకు సంతాపం తెలిపామన్నారు. సామాన్యులమైన తమకే సంస్కారం ఉంది.. చట్టసభల్లో ఉన్న మీకెంత సంస్కారం ఉండాలని ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

బస్తా ధాన్యానికి రూ.1500 మద్దతు ధర చెల్లించాలని జగన్ సర్కారును డిమాండ్ చేశారు. రైతు కష్టాన్ని మర్చిపోయే స్థాయికి రాజకీయం వచ్చిందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండించే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. రైతుల కన్నీరు తూడ్చడానికే మేం ఉన్నామని వైసీపీ నేతలు ముందుకు రావాలని అన్నారు. రైతుల ఆవేదనను ఇష్టానికి వాడుకుంటే.. మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న ప్రజలే తీసి పక్కన పెడతారన్నారు. రైతుల కోసం ‘మీరు ఛీకొట్టినా భరిస్తామన్న ఆయన సహనం తమకు బలమే కానీ బలహీనత కాదని అన్నారు. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమే కాదు.. తెలుగు మీడియం కూడా ఉండేలా ఆప్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

సీఎం జగన్ తన ఇంటికి రశీదులు ఇచ్చుకున్నారని, కానీ రైతు కష్టానికి రశీదు ఇవ్వడం లేదని.. ఇలాంటి 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అని నిలదీశారు. ప్రభుత్వాల దగ్గర తాను తగ్గే మాట్లాడతానన్న పవన్.. సమస్యల పరిష్కారం కోసం తాను తగ్గి మాట్లాడుతున్నానని అన్నారు. మానవత్వమే నా కులం అనే జగన్.. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి కులాన్ని ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. బ్రిటిష్ వాళ్లకు, మీకు తేడా ఏంటి.. కుల విభజన మీకెందుకు అని పవన్ నిలదీశారు. 150 మంది ఎమ్మెల్యేలు కూర్చొని తక్కువ ఖర్చుతో వ్యవసాయ యాంత్రీకరణకు ఏం చేయగలమో ఆలోచించాలని జనసేనాని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles