Rejected PM Modi's offer to work together: Sharad Pawar రాష్ట్రపతి ఆఫర్ పై శరద్ పవార్ స్పష్టత

Said no to modi got sonia uddhav together sharad pawar

Shiv Sena, Uddhav Thackeray, CM, Dy, CM, Minister portfolios, maharashtra government, Sharad Pawar, Congress, sonia gandhi, bjp, Narendra Modi, sharad pawar shiv sena, sharad pawar modi offer, sharad pawar modi, Shiv Sena-NCP-Congress alliance, Maharashtra, Politics

NCP chief Sharad Pawar has said PM Modi had proposed "working together", but he rejected the offer. He said he had turned down PM Modi's offer, which he claimed included a central cabinet spot for his daughter Supriya Sule, saying it would not be possible for him.

ప్రధానితో భేటీపై క్లారిటీ ఇచ్చిన శరద్ పవార్..

Posted: 12/03/2019 11:05 AM IST
Said no to modi got sonia uddhav together sharad pawar

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. ఇటీవల తాను ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఆయన నివాసంలోనే భేటీ కావడంపై.. తమ పార్టీ సరికొత్త రాజకీయ సమీకరణలకు ఆజ్యం పోస్తుందని వచ్చని వార్తలపై ఇప్పుడు ఎన్సీపి అధినేత శరద్ పవార్ పెదవి విప్పారు. ఇక తనకు రాష్ట్రపతి పదవిని కూడా బీజేపి ఆఫర్ చేసిందన్న వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో బీజేపితో కలసి ఎన్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వచ్చిన ఊహాగాలపై కూడా ఆయన స్పష్టం ఇచ్చారు.

నాటి సమావేశంపై శరద్ పవార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు న్యూఢిల్లీకి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం వాస్తవమే. అయితే తమ ఇద్దరి భేటీలో ఇద్దరం కలిసి పని చేద్దామన్న ప్రతిపాదన ప్రధాని మోదీ వైపు నుంచి వచ్చిందని చెప్పారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని పవార్ అన్నారు. "మనిద్దరి మధ్యా వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. కానీ, కలిసి పనిచేయడం జరిగే పని కాదు" అని స్పష్టం చేసినట్టు పవార్ తెలిపారు. ఇక ఈ విషయంలో బీజేపికి తాను మద్దతు తెలిపితే.. తనకు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నారు.

కాగా, తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే విషయం మాత్రం చర్చకు వచ్చిందన్నారు. ఎన్సీపీ మహారాష్ట్రలో బీజేపికి మద్దతు ఇస్తే.. శివసేన కు లభించిన కేంద్రమంత్రి పదవి ఖాళీ అవుతుందని, దానిని కూడా ఎన్సీపికి ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాని చెప్పారని శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో శరద్ పవార్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించడం, ఆ వెంటనే పవార్ హస్తినకు వెళ్లి చర్చలు జరపడంతో కొత్త పొత్తులు ఏర్పడనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే, చివరకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికలో ప్రభుత్వం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uddhav Thackeray  CM  shiv sena  congress  sonia gandhi  sharad pawar  NCP  Supriya sule  Maharashtra  Politics  

Other Articles