మహారాష్ట్రలో అనూహ్య రాజకీయా పరిణామాలను చవిచూసిన దేశప్రజలు.. తాజాగా కర్ణాటకలో ఆ మార్పులు గమనాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు శరద్ పవార్ ను బ్యాంకు నిధుల వ్యవహారంలో విచారిస్తారని వార్తలు రావడంతో ఆయనే స్వయంగా అధికారుల వద్దకెళ్లిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో సరిగ్గా ఉపఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలపై బెంగళూరు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో వీరిని కూడా సరిగ్గా ఎన్నికల ముందు అదుపులోకి తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సాక్ష్యాత్తు జాతిపిత మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చిన వ్యక్తిని దేశభక్తుడని పార్లమెంటులో పేర్కోన్న వ్యక్తులపై ఎలాంటి చర్యలను తీసుకోని అధికారులు, సామాజిక కార్యకర్తలు.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగాంగా తమ పార్టీ నేతలను టారెట్ చేస్తూ వారిపై కేసులు బనాయిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసనను వ్యక్తం చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని పిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అధికారుల చర్యలపై నిలదీస్తే.. రాజద్రోహం కింద కేసులు బనాయించాలని అంటారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఈ ఏడాది మార్చి 27న అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి, అప్పటి ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎంపీలు తదితరులు క్వీన్ రోడ్డులోని ఐటీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేశారు. ఐటీ అధికారులు భాజపా ఏజెంట్లు అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై మల్లికార్జున అనే వ్యక్తి స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
ఐటీ దాడులపై అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి తమ పార్టీ నేతలకు ముందే సమాచారం లీక్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే ఐటీ అధికారులు సోదాలకు వెళితే కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. మల్లికార్జున ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. మాజీ ముఖ్యమంత్రులు సహా సంకీర్ణ నేతలపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా.. దీనిపై కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని, దీనిపై తాము పోరాడుతామని అన్నారు. అవసరమైతే జైలుకైనా వెళ్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Feb 24 | పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆశ అన్నది అత్యాశగా మారిన మనిషి మోసపోక తప్పదు.. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లకు... Read more
Feb 24 | పుదుచ్చేరిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా వున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవడంలో విఫలం కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై... Read more
Feb 24 | కోర్టుల్లో న్యాయమూర్తులను ‘యువరానర్’ అని సంబోధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ న్యాయస్థానంలో ఈ పదాన్ని ఉచ్చరించాలో కూడా తెలియకపోవడం.. ఓ న్యాయవిద్యార్థిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభ్యంతరం వ్యక్తం... Read more
Feb 24 | మనిషి తన మేధోశక్తితో చంద్రయానం, మంగళయానంతో పాటు అంగారక గ్రహాన్వేషణ చేస్తూ.. పరగ్రహాలపై కూడా కాలుమోపి వస్తున్న తరుణంలోనూ మూఢాంధకారాలు, మూఢాచారాలు, మూడవిశ్వాసాలను మాత్రం వదలుకోవడం లేదు. దేశానికి స్వతంత్రం లభించిన 70 ఏళ్లు... Read more
Feb 24 | కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే దేశం నలువైపుల నుంచి డిమాండ్లు పెల్లుబిక్కుతున్న తరుణంలో ఆయన... Read more