woman veternary doctor brutal murder at shadnagar షాద్ నగర్ లో దారుణం.. వైద్యురాలి హత్య, దహనం..

Burnt body of woman veternary doctor found near hyderabad

veterinary doctor murdered and burnt, burnt body of woman vet, Priyanka reddy murdered, Priyanka reddy burnt, veterinary doctor, chatanpally village, madhapur, shadnagar, lorry drivers, scooty, rachakonda police, Telangana, Crime

The burnt body of a woman was found near Chatanpally village of Shadnagar here on Thursday. The body was identified as that of Priyanka Reddy, 26, a veterinary doctor. The victim may have been killed elsewhere and body dumped in Shadnagar, police said.

షాద్ నగర్ లో దారుణం.. వైద్యురాలి హత్య, దహనం..

Posted: 11/28/2019 02:32 PM IST
Burnt body of woman veternary doctor found near hyderabad

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ పశు వైద్యురాలిపై కొందరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. జిల్లాలోని షాద్ నగర్‌ సమీపంలో అమెను సజీవ దహనం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో అమె వెటర్నరీ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న ఆమె యధావిధిగా నిన్న సాయంత్రం కూడా విధులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తూ.. అగంతకుల చేతిలో హత్యకు గురైంది. అమె శవాన్ని కూడా అగంతకులు దహనం చేశారు. షాద్ నగర్ మండలం చలాన్ పల్లి గ్రామ శివార్లలో ఓ బ్రిడ్జి ఓవర్ రోడ్డు అమె పూర్తిగా కాలిన శవాన్ని పోలీసులు గుర్తించారు.

మహబూబ్ నగర్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామానికి చెందిన అమె.. ప్రస్తుతం శంషాబాద్ లో స్థిరపడ్డారు. ప్రతీరోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లే వస్తూండేది. యధావిధిగా బుధవారం కూడా విధులకు వెళ్లిన ప్రియాంక.. తన స్కూటీ మార్గమధ్యంలో పాడుకావడంతో అందోళనకు గురైంది. అప్పటికే రాత్రి కావడంతో తన పరిస్థితిని తన సోదరికి ఫోన్ ద్వారా చెప్పింది ప్రియాంక. తన సోదరి భయపడుతూ తనకు ఫోన్ చేసిందని, అక్కడ లారీ డ్రూవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా వుందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు తెలిపారు.

కొందరు స్థానికులు అమెకు సాయం చేసేందుకు ప్రయత్నించారని, అమె స్కూటీని రిపేర్ చేయిస్తామని తీసుకెళ్లినా.. రాత్రి సమయం కావడంతో దుకాణాలు మూసివున్న కారణంగా మళ్లీ తిరిగి తీసుకువచ్చారని తనకు చెప్పిందని ప్రియాంక సోదరి తెలిపారు. దీంతో నిర్జన ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండటం ఎందుకు.? స్కూటీని అక్కడే వదిలేసి నువ్వు మాత్రం టోల్ గేట్ వద్దకు వచ్చేయ్ అని తాను ప్రియాంకతో చెప్పానని, అయినా అమె తన మాటలను పట్టించుకోలేదని, తన చెల్లి తిరిగిరాకపోవడంతో.. ఇంత ఘోరం జరుగడం తమను కలిచివేస్తుందని ప్రియాంక సోదరి తెలిపారు.

అయితే ప్రియాంక రెడ్డిని ఎవరు హత్య చేశారనే అంశంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ప్రియాంక రెడ్డి అనుమానించినట్టుగా లారీ డ్రైవర్లే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి... అనంతరం హత్య చేశారా? అనే కోణంలోనే పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే... సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించాల్సి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక తన చెల్లెలికి చివరిసారీగా ఫోన్ చేసిన సమయంలో ఎక్కడ ఉన్నట్టు చెప్పిందనే విషయంపై ఆరా తీస్తున్న పోలీసులు... అక్కడ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో పాటు ఆమె ఫోన్ నుంచి చివరిసారి ఎవరికి ఫోన్ చేసిందనే విషయం తెలిస్తే... ప్రియాంక హత్య కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ప్రియాంకపై అత్యాచారానికి పాల్పడిన లారీ డ్రైవర్లు అమెను హత్య చేసి దహనం చేయాల్సిన అసవరమేంటని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. జరిగిన నేరాన్ని బట్టి చూస్తే నేరస్థులకు ప్రియాంపై ఏదో కక్షసాధింపు సాగించినట్టుగా వుందని, ఈ కోణంలోనూ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles