మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులకు ఫుల్ స్టాప్ పడటం లేదు. బీజేపికి తగిన సంఖ్యాబలం వుంటే వెంటనే బలనిరూపణ చేసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణమాలకు మించి ఇక ఏమీ లేవు ప్రభుత్వ ఏర్పాటు తప్ప అని భావిస్తున్న తరుణంలో మరోమారు అన్యూహ పరిణామాలే ఎదురవుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తిరిగి శరద్ పవార్ గూటికి వచ్చేసిన అజిత్ పవార్ మరోమారు కూటమివర్గాలకు షాక్ ఇస్తున్నారా.? అంటే ఔననే చెప్పాలి.
ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి ఆయన ఫోన్ అందుబాటులో లేదు. ఉపముఖ్యమంత్రి పదవిని త్యజించి వచ్చినా.. మళ్లీ అదే పదవి ఆయనకు దక్కుతున్న తరుణంలో అనూహ్యంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇక ఇదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం బారామతిలో వెలసిన పోస్టర్లు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి వద్దని, ఏకంగా సీఎం పదవినే చేపట్టాలని పోస్టర్లు వెలిసాయి. బావి ముఖ్యమంత్రి అజిత్ పవారేనంటూ పోస్టర్లు వెలిశాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైన వేళ అజిత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.
ఇక దీనిపై స్పందించిన ఎన్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. అజిత్ ప్రస్తుతం తమకు అందుబాటులోనే ఉన్నారని, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారని తెలిపారు. తరచూ కాల్స్ వస్తుండటంతో ఫోన్ స్విచ్చాప్ చేశారని క్లారిటీ ఇచ్చారు. అటు అజిత్ సొంత నియోజకవర్గమైన బారామతిలో భావి ముఖ్యమంత్రి అజిత్ పవారేనంటూ ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేసిన పోస్టర్ల విషయమై అడిగిన ప్రశ్నకు అభిమానులు తమ ప్రియమైన నేతలకు ఉన్నతమైన పదవులు రావాలని.. ఆశిస్తుంటారని.. ఆకాంక్షిస్తుంటారని ఇందులో విచిత్రమేముందని ఆయన తిరిగి ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కూటమి పార్టీలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య పదవుల పంపకంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశముందని తెలుస్తోంది. పదవుల పంపకంలో భాగంగా ఎన్సీపీకి డిప్యూటీ చీఫ్ మినిష్టర్, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవులు ఖరారైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పీకర్ పృథ్వీరాజ్ చౌహాన్, ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారని కూటమి వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more