Congress leader Revanth reddy slams TRS Govt ఇంకా ఎంతమంది చనిపోతే స్పందిస్తారు.. సీఎంపై రేవంత్ ఫైర్

Another tsrtc employee dies of heart stroke

TSRTC Workers, High Court, Routes Privatise, Jana Samiti, PIL,RTC MD Sunil sharma, kareem khan, karimnagar, TRS, rtc mechanic, heart stroke, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Another Telangana State Road Transport Corporation (TSRTC) employee dies of Heart stroke belonging to Nizamabad depot. Mangal pad is driver of mangal pad depo. congress leader Revanth Reddy fires on KCR for objecting employees from joining their duties.

మరో టీఎస్ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు అందోళన

Posted: 11/26/2019 01:32 PM IST
Another tsrtc employee dies of heart stroke

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.. సుదీర్ఘ సమ్మెను విమరించిన ఆర్టీసీ జేఏసీ.. డిపోల దగ్గరకు వెళ్లి కార్మికులు తమ విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చింది. ఈ పరిణామాలపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి చేర్చుకోలేమని తేల్చిచెప్పింది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అదేశాలు అందలేదని కూడా స్పష్టం చేసింది. ఈ పరిణామాలను చూసి గెండెబద్దలైన మరో ఆర్టీసీ కార్మికుడు మరణించాడు.

నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపోలో పనిచేసే మంగల్ పాహాడ్ ప్రాంతానికి చెందిన డ్రైవర్ ఆకస్మికంగా గుండెపోటు గురయ్యారు. ఎడపల్లి మండలం మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చిట్వేలా రాజేందర్ (52) ఆర్టీసీ జేఏసీ పిలుపు అందుకొని సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాడు. తన ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో అనే ఆందోళనతో గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్తాపానికి, మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 25) ఉదయం గుండెపోటుకు గురయ్యాడు.

గుండెపోటుకు గురైన రాజేందర్ ను కుటుంబ సభ్యులు నిజామాబాద్ పట్టణంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సమ్మె విరమించినా.. ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని కార్మికులు తెలిపారు. దీంతో నిజమాబాద్ జిల్లాలో కాసింత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఢిపో వద్దకు కార్మికులు రాజేందర్ మృతికి నిరసనగా అందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఎంత మంది చనిపోతే.. తమని విధుల్లో చేర్చుకుంటారని వారు నిలదీస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ కాలంగా చేసిన సమ్మెను వదిలేసి తమకు ఉద్యోగాలే ముఖ్యమని భావించి వస్తే.. వారిని విధుల్లో చేర్చుకోనీయకుండా అడ్డంకులు సృష్టించడం సబబుకాదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు ఆర్టీసీ కార్మికులు వేతనాలను 67శాతం మేర పెంచినా.. రెండు నెలల వేతనం అందకపోవడంతో వారు ఇళ్లు గడవక సమ్మెను విరమించి ఉద్యోగం కావాలని వస్తున్నారని అయినా ప్రభుత్వానికి వారిపై కరుణలేదని ఆయన ధ్వజమెత్తారు.

వేల రూపాయల్లో వేతనాలు తీసుకునే కార్మికులకు ఈ ప్రభుత్వం తలోగ్గదని, కోట్లాది రూపాయలతో వ్యవహారాలను నడిపించే పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు ఈ ప్రభుత్వం జీ హుజూర్ అని హాజరవుతుందని ఆయన విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెకు దిగి, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరుతామంటే కుదరదంటూ ప్రభుత్వం చెబుతున్న విషయం వెనుక.. అసలు కారణం కార్మికులు మూకుమ్మడిగా జేఏసీ వెనుక నిలబడటమే కారణమని తెలుస్తోందని రేవంత్ విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ దుర్మార్గ పాలనకు పరాకాష్ఠగా మారిందని ధ్వజమెత్తిన ఆయన ముప్పై మంది చనిపోయిన కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుంది మండిపడ్డారు. ఇంకా ఎంత మంది చనిపోతే మీ రక్తదాహం తీరుతుంది? అని ప్రశ్నించారు. బేషరతుగా ఆర్టీసీ కార్మికులందరినీ తక్షణం విధుల్లోకి తీసుకోవాలి' అని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, ఆర్టీసీ కార్మికుల విషయమై సీఎం కేసీఆర్ ఆ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం దీనిపై కీలక నిర్ణయం ప్రకటిస్తారని సీఎం కార్యాలయ వర్గాలు పర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Workers  High Court  Routes Privatise  Jana Samiti  PIL  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles