TSRTC JAC Secretary Nagesh Patel Resigns టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. జేఏసీ ప్రకటన..

Tsrtc strike jac s offer to call off strike causes rift among protesting workers

TSRTC Workers, High Court, Labour court, RTC MD Sunil sharma, telangana buses, tsrtc strike, tsrtc buses, tsrtc state government, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Putting an effective end to 51-day long strike, Telangana State Road Transport Corporation-Joint Action Committee (TSRTC-JAC) on Monday called off the strike and asked the employees to join back the services with immediate effect.

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. జేఏసీ ప్రకటన..

Posted: 11/25/2019 05:53 PM IST
Tsrtc strike jac s offer to call off strike causes rift among protesting workers

తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ చరిత్రలో అత్యధిక రోజుల పాటు చేసిన సమ్మె ఆర్టీసీ కార్మికులు సమ్మె చరిత్రపుటలకెక్కినా.. ఏ ఫలితం తేలని సమ్మెగా ఇది మిగిలిపోవడం మరో చరిత్రను సృష్టించినట్లైంది. ఏకంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను కార్మికులు ఇవాళ విరమించారు. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సమ్మె.. చివరకు వారి పిలుపు మేరకే విరమించుకున్నారు. కార్మికులు ఆకలిదప్పులను, బలవన్మరణాలను, మానసిక అందోళనలను దృష్టిలో పెట్టుకున్న జేఏసీ ఇక సమ్మెను కొనసాగించి కార్మికులకు మరింత అగాధంలోకి తీసుకెళ్లలేమని నిర్ణయించుకున్నాయి.

మంగళవారం కార్మికులంతా డిపోల వద్దకు చేరుకుని విధుల్లో చేరేందుకు సిద్ధం కావాలని ఈయూ కార్యాలయంలో సమావేశమైన అనంతరం అశ్వత్థామ పిలుపునిచ్చారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరగుతుందనే నమ్మకముందని అశ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామన్నారు. ఇన్ని రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలవలేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు.

మొదటి షిఫ్ట్‌ కార్మికులతో పాటు రెండో షిఫ్ట్‌ కార్మికులు కూడా రేపు ఉదయం డిపోల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగులు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చిన సందర్భంగా సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలన్నారు. కార్మికులందరికీ అనుకూల వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీలో జరుగుతున్న సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashwathama Reddy  TSRTC  Unions JAC President  tsrtc strike  Labour court  High Court  telangana  Politics  

Other Articles