Speeding car falls off Biodiversity flyover బయో డైవర్సీటీ ఫ్లైఓవర్ పై ప్రమాదం.. మూసివేత..

Woman killed as speeding car falls on her from bio diversity flyover in hyderabad

Hyderabad accident, speeding car falls off, speeding car, Gachibowli accident, Gachibowli flyover, flyover in Gachibowli, bio-diversity flyover, bio-diversity flyover in Hyderabad, video viral, cyberabad, Telangana, Crime

A woman killed and several injured after a speeding car fell off a newly inaugurated flyover in Gachibowli area of Hyderabad on Saturday around 1 pm. The major accident also damaged two cars underneath the flyover.

ITEMVIDEOS: బయో డైవర్సీటీ ఫ్లైఓవర్ పై ప్రమాదం.. మూసివేత..

Posted: 11/23/2019 06:57 PM IST
Woman killed as speeding car falls on her from bio diversity flyover in hyderabad

నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ ప్రమాదాలకు నెలవుగా మారిందా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రారంభమైన ఈ ప్లైఓవర్ ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితనాన్ని ప్రశ్నిస్తోంది. ఇవాళ జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. గ్లాల్లో తేలినట్టుందే.. అన్న పాటలు పక్కన బెడితే ఈ ప్లైఓవర్ పై ప్రయాణిస్తే.. తప్పకుండా వాహనాలతో పాటు గాల్లో తేలి కింద పడాల్సి వస్తుందని ప్రయాణికులు వ్యంగంగా వ్యాఖ్యానించే దుస్థితి వచ్చింది.

ఇవాళ ఈ ప్లైఓవర్ పై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మధ్యాహ్నం ఫ్లైఓవర్‌ మీదుగా ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పల్టీ కొట్టింది. వంతెన పైనుంచి కింద రహదారిపై ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళపై పడింది. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని సమాచారం. కాగా అధిక వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో కారు తునా తునకలు అవ్వగా, చెట్లు విరిగి పడ్డాయి. మరోవైపు ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే గత వారం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ పోలిస్ కమీషనర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ అదేశాల నేపథ్యంలో ప్లైఓవర్ ను మూడు రోజుల పాటు మూసివేసి.. వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles