Another Case filed on Former MLA Chintamaneni Prabhakar చింతమనేనిపై ఏలూరు త్రీ టౌన్ ఠాణాలో మరో కేసు..

Another case filed on former mla chintamaneni prabhakar

chintamaneni Prabhakar, Denduluru former MLA, TDP leader, Eluru Three Town Police Station, Eluru sub-jail, Bail, Grand Welcome, law and order, SC and ST atrocity case, YSRCP, YCP Govt, Andhra Pradesh, Politics

After the Release of TDP leader and Denduluru former MLA Chintamaneni Prabhakar from the Eluru sub-jail, another case has been filed on him by Eluru three Town Police. On the occasion of his release from Jail, the TDP leaders and activists reached the jail and given a grand welcome to him posing a threat to law and order.

చింతమనేనిపై ఏలూరు త్రీ టౌన్ ఠాణాలో మరో కేసు..

Posted: 11/18/2019 11:44 AM IST
Another case filed on former mla chintamaneni prabhakar

టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదయ్యింది. సుమారు 66 రోజుల తరువాత ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో.. గత శనివారం బెయిల్ పై విడుదలైన ఆయనపై ఏలూరు త్రిటౌన్ పోలీసులు తాజాగా మరో కేసును నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద తొలుత కేసులు నమోదు కావడం.. దాంతో ఆయన అరెస్టుకు పోలీసులు సన్నధం కావడంతో ఆయన కొన్ని రోజుల పాటు తప్పించుకుని తిరిగారు. అదృశ్యం అయ్యారన్న వార్తలు తెరపైకి రావడం.. ఆ క్రమంలో ఆయన సతీమణి అనారోగ్యం పాలుకావడంతో ఆమెను చూడటానికి వచ్చిన చింతమనేని.. పోలీసులకు లొంగిపోయారు.

ఈ క్రమంలో ఆయనపై మరో కొన్ని కేసులు నమోదుకావడంతో మొత్తంగా 18 కేసులను పోలీసులు నమోదు చేశారు. అయితే పలు కేసులకు బెయిల్ లభించినా.. మిగిలిన కేసులపై ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన 66 రోజుల పాటు ఆయన జుడీషియల్ రిమాండ్ లోనే వున్నారు. అయితే ఈ నెల 15న ఆయనకు బెయిల్ లభించడంతో ఆయన 16న విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు దెందులూరు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద స్థాయిలో ఏలూరు సబ్ జైలుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ర్యాలీగా బయలు దేరి.. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరయ్యారు.

ఆ సందర్భంగా వైసీపీ నేతలపై, ప్రభుత్వాధినేత పేర్లను ప్రస్తావించకుండా.. వారిపై తీవ్ర విమర్శలను గుప్పించారు. తనపై కావాలనే కక్షగట్టిన ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తాజాగా ఆయనపై ఏలూరు త్రిటౌన్ పోలీసులు ఆయనపై మరో కేసును నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారని. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం ఆయనపై 19 కేసులు నమోదుకాగా, ఈ కేసులో ఆయనను మరోమారు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles