The inflated prices on food will go into effect in the next 15 days - IRCTC పెంచిన ధరలు మరో 15 రోజులలో అమలులోకి రానున్నాయి… - ఐ.ఆర్.సి.టీసీ

The inflated prices on food will go into effect in the next 15 days irctc

IRCTC, catering service fares, Shatabadi, Rajdhani, Duronto, AC Trains, IRCTC Food Prices, Indian Railways

IRCTC decided to hike the catering service fares on Shatabadi, Rajdhani and Duronto class of trains. The revised tariff and menu will be available after 15 days in the ticket system.

పెంచిన ధరలు మరో 15 రోజులలో అమలులోకి రానున్నాయి… - ఐ.ఆర్.సి.టీసీ

Posted: 11/15/2019 06:27 PM IST
The inflated prices on food will go into effect in the next 15 days irctc

తెల్ల దొరలూ వదిలెళ్లిన ఒకే ఒక ఉపయోగ వాహనకారకం నేటి రైలు.. అవి ఎంత ఉపయోగకారకాలుగా పని చేసినా అంత ఇబ్బందిని కూడా కలిపిస్తాయి మన ప్రజామానవాళికి .. కానీ రైళ్లలో సుఖ ప్రయాణం మినహా మిగిలినా వాటి బాధలు అనుభవించే ప్రజలకే తెలుస్తుంది.. తక్కువ ఖర్చుతో తిరిగే ఈ రైలు ప్రయాణం నేడు మరో విషయాన్ని మనకి తెలియపరుస్తుంది.. .

నేడు మన భారత దేశంలో ప్రతి ఒక వస్తువు పై ఖరీదు అమాంతం పెరిగిపోతుంది .. దాన్ని అరికట్టాలనే ఆలోచన మనస్సులో తప్ప కార్య దిశలోకి రాదు ఎన్నటికీ .. మౌనంగా వీటిని ఓర్చుకున్నె ప్రతి ఒక మధ్య తరగతి,పేదరిక ప్రజా బృందానికి ఈ సందేశం. మీరు రైళ్లలో ప్రయాణిస్తున్నారా .. అయితే ఈ విషయం మీకోసమే..

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు అందించే ఆహారాన్ని పెంచడంలో “ ఐ.ఆర్.సి .టీసీ “ ఒక కీలక నిర్ణయాన్ని నేడు శుక్రవారం నాడు తీసుకున్నది .. ఇక పై రాజధాని,శతాబ్ది మరియు దురంతో ఎక్సుప్రెస్ రైళ్లలో ఆహారం ఖరీదు పెంచుతున్నట్లు వెల్లడించింది..

ఇప్పటివరకు ఈ రైళ్లలో ప్రయాణించే మొదటి ఏసీ, ఎగ్జిక్యూటివ్ లలో ప్రయాణించే వాళ్ళు ఒక కప్పు టీ కి 35 రూపాయలు చెల్లించేవాళ్లు .. అల్పాహారం పై 7 రూపాయలా పెంపు పై దాని ధర 140 రూపాయలు చేరుకుంది. .. మరియు రాత్రి భోజనం పై 15 రూపాయలా పెంపుతో దాన్ని ఖర్చు మొత్తం 245 రూపాయలకు చేరింది.. ఇక సెకండ్ ఏసీ ,థర్డ్ ఏసీ మరియు చైర్ కార్ లలో ప్రయాణించే వారికి కప్పు టీ 20 రూపాయలు.. అల్ప ఆహారానికి 105 రూపాయలు మరియు మధ్యాహ్నం ,రాత్రి భోజనాలకు 185 రూపాయలు చెల్లించవలసినదిగా ప్రకటనలో పేర్కొన్నారు..

అంతేకాకుండా ఇక పై రైళ్లలో ప్రాంతీయ వంటకాలను కూడా ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేసారు.. పెంచిన ధరలు మరో 15 రోజులలో అమలులోకి రానున్నాయి.. ఈ దిశలో రైల్వే టికెట్ వ్యవస్థలో రైల్వే శాఖా మార్పులు చెయ్యనున్నది..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : IRCTC  Indian Railways  

Other Articles