NCP Ajit Pawar to meet Governor today మహారాష్ట్ర గవర్నర్ తో ఎన్సీపీ భేటీ

Maharashtra ncp leaders meeting to begin shortly congress in huddle

BJP, Shiv Sena, Maharashtra government formation, Devendra Fadnavis, Aravind sawant, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

Congress will only issue a letter of support to the Shiv Sena once NCP’s Sharad Pawar gives them a green signal. Pawar is reportedly mediating between Sena and the Congress over modalities of the coalition.

మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. గవర్నర్ తో భేటీకానున్న ఎన్సీపీ..

Posted: 11/12/2019 11:04 AM IST
Maharashtra ncp leaders meeting to begin shortly congress in huddle

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గత పక్షం రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభన రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త ట్విస్టులతో ముడిపడుతూ.. మరింత ముదురి పాకన పడుతోంది. ఈ నెల 9 శనివారంతో గత ప్రభుత్వ పదవీకాలం ముగిన క్రమంలో మహారాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నావిస్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ రాజ్యాంగబద్దంగా నిర్ణయాలు తీసుకుంటూ రెండవ అతిపెద్ద పార్టీ శివసేనను ప్రభుత్వాన్ని అహ్వానించేందుకు పిలిచి.. గడవును కేటాయించారు.

ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన శివసేనకు చివరాఖకు క్షణంలో కాంగ్రెస్ యూ-టార్న్ తీసుకోవడంతో ట్వీస్ట్ ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. శివసైనికుడే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించినా.. అందుకు అనుగూణంగా పావులు మాత్రం కదపలేకపోయింది. దీంతో శివసేన గడువు ముగిసిన తరుణంలో ఇక ఇవాళ మూడవ అతిపెద్ద పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని గవర్నర్ అహ్వానించారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గడువులోగా శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో, గవర్నర్ తాజాగా ఎన్సీపీని ఆహ్వానించారు.

గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం అందిందని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. పిలుపు మేరకు గవర్నర్ ను కలిసేందుకు వెళుతున్నామని, అయితే ఆయన ఎందుకు పిలిచారో తమకు తెలియదని పవార్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల ముందు వరకు ఎంతో ధీమాగా ఉన్న శివసేన ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. తొలుత మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపిన కాంగ్రెస్ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాము ఎన్సీపీతో కూడా చర్చించాల్సి ఉందంటూ కాంగ్రెస్ అధినాయకత్వం శివసేనకు నిరాశ కలిగించే సంకేతాలు పంపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles