Karnataka bypolls: Filing of nominations begin కర్ణాటకలో ఉపసమరానికి ప్రారంభమైన నామినేషన్ల పర్వం.!

Karnataka bypolls filing of nominations begin disqualified mlas await sc verdict

Karnataka bypolls, Karnataka byelections, Election Commission, EC, Siddarmaiah, President Ram Nath Kovind, Amit Shah, Union Home Minister, BJP politics, Yediyurappa, BSY, dinesh gundu rao, Bengaluru news, December 5 elections, Karnataka rebel MLAs, disqualified MLAs Supreme Court, SC verdict, BJP poaching, D K Shivakumar, Karnataka CBI, IT raids, Karnataka, politics

With the filing of nominations to 15 legislative constituencies in Karnataka scheduled to begin on Monday, the disqualified MLAs — 17 in total from Congress and JD(S) — will not learn till the Supreme Court verdict on their pleas challenging the Speaker’s decision to disqualify them.

కర్ణాటకలో ఉపసమరానికి ప్రారంభమైన నామినేషన్ల పర్వం.!

Posted: 11/11/2019 03:49 PM IST
Karnataka bypolls filing of nominations begin disqualified mlas await sc verdict

కర్ణాటకలో ఉప ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. అనర్హ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన 15 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ నియోజకవర్గాల్లోంచి ఇద్దరు బీజేపి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహా డికే శివకుమార్ ను కూడా కలిశారు. తమకు కాంగ్రెస్ నుంచి టికెట్లను ఇవ్వాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే గెలుపొంది వస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా రాష్ట్రంలోని అధికార బీజేపి మాత్రం మారుతున్న సమీకరణలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే అధిష్టానం బీజేపి రాష్ట్ర నాయకత్వానికి పలు అదేశాలు జారీ చేసిందని.. దీంతో వాటినే ఫాలో అయ్యేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ బీఫామ్ లపై గెలిచి.. బీజేపి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ, సభకు హాజరుకకుండా తమ బలం నిరూపణకు పరోక్షంగా సహకరించి వారినే ఉప ఎన్నికలలో మద్దతు పలకాలని బీజేపి అధిష్టానం అదేశాలు జారీచేసిందని కాంగ్రెస్ అరోపిస్తోంది. అయితే ఇందుకనుగూణంగానే మారుతున్న సమీకరణలను సీఎం యడ్యూరప్ప పరిశీలిస్తున్నారు.

ఇదిలావుండగా, .. ఈ 15 నియోజకవర్గాల్లో ఇవాళ్టి నుంచి ‘కోడ్‌’ అమలులోకి వచ్చింది. బెళగావి జిల్లా అథణి, కాగవాడ, గోకాక్‌, ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర, హావేరీ జిల్లా హిరెకెరూరు, రాణిబెణ్ణూరు, బళ్ళారి జిల్లా విజయనగర్‌, చిక్కబళ్ళాపుర జిల్లా చిక్కబళ్ళాపుర, బెంగళూరు నగర పరిధిలోని కె.ఆర్‌.పుర, యశ్వంతపుర, మహాలక్ష్మి లే అవుట్‌, శివాజీనగర్‌ బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటె, మండ్య జిల్లా కె.ఆర్‌.పేట, మైసూరు జిల్లా హుణసూరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
ఈనెల 18వరకు నామినేషన్‌లు స్వీకరిస్తామని, 19న పరిశీలన ఉంటుందన్నారు. 21వరకు ఉపసంహరణకు గడువు ఉందన్నారు. డిసెంబరు 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల దాకా పోలింగ్‌ సాగనుందన్నారు. డిసెంబరు 9న కౌంటింగ్‌ జరుగనుందన్నారు. 15 నియోజకవర్గాలకు సంబంధించి 37,50,565 మంది ఓటర్లు ఉండగా వీరిలో 19,12,799 మంది పురుషులు, 18,37,375మంది మహిళలు, 399 మంది ఇతరులు ఉన్నారు. 15 నియోజకవర్గాలకు గాను 4,185పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం చేయగా 10శాతం మంది రిజర్వుడు ఉద్యోగులతో కలిపి 22,598 మందిని నియమించుకున్నట్టు తెలిపారు.
 
ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే 8 నియోజకవర్గాలకు ఏఐసీసీ కమిటీ ద్వారానే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 7 నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖారరు చేయాల్సి వుంది. కాగా రేపు రెండో జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా జేడీఎస్‌ ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ మంగళూరులో ప్రకటించారు. బీజేపీతో మేము మృదువుగా లేమని జేడీఎస్ ను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమన్నారు. 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను రెండు రోజుల్లోనే ఖరారు చేస్తామన్నారు.
 
ఉప ఎన్నికల నామినేషన్ల పర్వ ప్రారంభమైన నేపథ్యంలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టిన విషయం తెలిసిందే. దీంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ ను స్వీకరించిన న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇవ్వనుందోనని వారు ఎదరుచూస్తున్నారు. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే తమ అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని బీజేపి కార్యాలయ వర్గాల సమాచారం. తీర్పు అనుకూలంగా వస్తే అనర్హులకు, కాని పక్షంలో వారు సూచించిన వారికే టికెట్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles