Leaders condole death of former CEC TN Seshan టీఎన్ శేషన్ మృతి పట్ల ప్రముఖుల దిగ్బ్రాంతి

Leaders condole death of former cec t n seshan the face of electoral reforms

T.N. Seshan, T.N. Seshan death, Seshan passes away, former chief election commissioner, PM Modi, Sonia Gandhi, Rahul Gandhi, Mamata Banerjee, YS Jagan, Chandrababu, Devendra Fadnavis, electoral reforms, Indian Politics

Leaders across the political spectrum on Monday condoled the passing away of the former Chief Election Commisioner, who had initiated the process of cleaning up the electoral system in the 1990s.

టీఎన్ శేషన్ మృతి పట్ల ప్రముఖుల దిగ్బ్రాంతి

Posted: 11/11/2019 02:36 PM IST
Leaders condole death of former cec t n seshan the face of electoral reforms

భారత్‌లో ఎన్నికల గతిని మార్చిన కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ క్రితం రోజు రాత్రి కన్నుమూయడంతో ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన ఇంట్లో గుండెపోటు గురై మృతి చెందారు. డిసెంబరు 1932లో కేరళలోని పాలక్కాడ్ జిల్లా తిరునెళ్లాయిలో శేషన్ జన్మించారు. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన కాలంలో ఎన్నో సంస్కరణలను అమలు చేశారు. అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టారు. దానికి కొత్త రూపు తీసుకొచ్చారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ కు ఎన్ని అధికారాలు ఉంటాయో అన్నీ దేశానికి చూపించారు. భారత ఓటర్లకు ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టారు. ఎన్నికలలో ప్రచార వేళల కుదింపు, ఎన్నికల్లో వ్యయ నియంత్రణ వంటి వాటిని అమలు చేసి చండశాసనుడుగా పేరు తెచ్చుకున్నారు. 1989లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన శేషన్.. 1996లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

టీఎన్‌ శేషన్‌ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ శేషన్ మృతి పట్ల తన దిగ్భ్రింతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను చాలా భాదించిందని అన్నారు. సివిల్ అధికారిగా తన కర్తవ్యాన్ని ఎంతో శ్రద్దా, సమగ్రతతో నిర్వహించిన కార్యోన్ముఖ అగ్రగన్యుడు శేషన్ అని కొనియాడారు. ఎన్నికల సంస్కరణలకు ఆయన తీసుకున్న నిర్ణయాలు.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇనుమడింపజేశాయని.. ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నికలలో పాల్గోనేందుకు ముందుకోచ్చేలా ఆయన నిర్ణయాలు ప్రోత్సహించాయని ప్రధాని పేర్కోన్నారు.

కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ మరణం పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎంతో అనుభవమున్న సివిల్‌ అధికారి శేషన్‌. కేంద్ర ఎన్నికల సంఘం బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఎన్నో ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన మృతి విచారకరం’ అని సోనియాగాంధీ సంతాపం తెలియజేశారు.

నిష్పక్షపాతంగా, ధైర్యంగా ఉండే అతికొద్ది మంది ఎన్నికల అధికారుల్లో శేషన్‌ ఒకరని రాహుల్‌ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నికల సంఘంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటిలా కాకుండా ఒకప్పుడు మన ఎన్నికల కమిషనర్లు నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా, ధైర్యంగా ఉండేవారు. అలాంటి వారిలో టీఎన్‌ శేషన్‌ ఒకరు. ఆయన మృతి బాధాకరం. శేషన్‌ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘టీఎన్‌ శేషన్‌ మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దేశ ప్రజాస్వామ్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందిస్తూ.. ‘టీఎన్‌ శేషన్‌ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన నిజమైన లెజెండ్‌. ఎన్నికల సంస్కరణలకు ఆయన చేసిన కృషి భవిష్యత్‌కు మార్గదర్శకం. నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని పేర్కొన్నారు.

టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తంచేశారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకిత భావానికి శేషన్‌ నిలువుటద్దమని, పబ్లిక్‌ సర్వెంట్ గా శేషన్‌ సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల కమిషన్‌ శక్తిని ప్రజాస్వామ్య సౌథ నిర్మాణానికి ఎలా ఉపయోగించవచ్చో శేషన్‌ నిరూపించారని జగన్‌ కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య  చరిత్రలో శేషన్‌ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

టిఎన్ శేషన్ భారత ప్రజాస్వామ్యానికి నూతన జవసత్వాలు కల్పించారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో సంస్కరణలు తెచ్చి ఎన్నికల కమిషన్ ను బలోపేతం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ, విధి నిర్వహణలో నిబద్దత, నిజాయితీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశాయి. దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ టిఎన్ శేషన్. సమకాలీన యంత్రాంగానికి శేషన్ మార్గదర్శకుడు కావాలి. భవిష్యత్ తరాలకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకం కావాలి. టిఎన్ శేషన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శేషన్ ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles