it's time for Bharat Bhakti, says PM Modi అయోద్య తీర్పుపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన ట్వీట్..!

Ram bhakti or rahim bhakti it s time for bharat bhakti says pm modi

ayodhya verdict, supreme court verdict, ram temple, babri masjid, SC five judge bench, PM Narendra Modi, shia board on ram mandir,asi report on ram mandir,result of ram mandir case,result of ram mandir,ram mandir case result,what is the decision of supreme court on ram mandir,news on ram mandir,result of ayodhya ram mandir case,ram mandir result,ram mandir

After the Supreme Court's historic verdict on the Babri Masjid-Ram Temple title dispute, PM Modi said no one should look it as "victory or defeat". "Whether it's Ramashakti or Rahimshakti, this is the time to strengthen the spirit of Bharatbhakti,".

రామభక్తా.. రహీమ్ భక్తా.. కాదు దేశభక్తే ముఖ్యం: ప్రధాని మోడీ

Posted: 11/09/2019 03:41 PM IST
Ram bhakti or rahim bhakti it s time for bharat bhakti says pm modi

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రపంచంలోనే బిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన దేశం భారతదేశమని, అయోధ్యపై తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలు శాంతి సామరస్యంతో స్వాగతించాలని ఇది మన ఐకమత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తుందని అన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ అయోధ్యలోని వివాదాస్పద భూమిపై తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈ తీర్పుపై తనదైన శైలిలో వ్యవహరిస్తూ దేశప్రజలతో తన ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు మత విశ్వాసాలు వున్నాయి. అయితే తీర్పు నేపథ్యంలో ప్రపంచానికి మనం చాటాల్సింది మాత్రం మత విశ్వాసం కాదన్నారు. రామభక్తా లేక రహీమ్ భక్తా అన్న అంశానికి ఈ విషయంలో అస్కారమే లేదని అన్నారు. ప్రస్తుత తరుణంలో మనం దేశభక్తి అదే భారత భక్తిని చాటుకోవాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఈ క్రమంలో దేశప్రజలందరూ శాంతి సామారస్యాలతో ఐక్యతను చాటుతారని అభిలాషించారు.


భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టిని తీర్పు చాటిచెబుతోందని మోదీ అన్నారు. 'చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనం. 130 కోట్ల మంది పాటిస్తోన్న శాంతి, సంయమనం, విలువలకు ఇది ప్రతీక. ఈ ఐక్యతా భావం దేశాభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతోన్న వివాదానికి సామరస్య ముగింపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను తెలిపేందుకు సరిపడా సమయం దొరికింది. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది' అని చెప్పారు.  

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 134 ఏళ్లుగా వివాదాస్పదమైన భూమిపై చారిత్రక తీర్పును వెలువరించ్చిందని, భారత సామాజిక నిర్మాణానికి ఈ తీర్పు మరింత బలాన్నిస్తోందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరు ఈ తీర్పును సమదృష్టితో చూడాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. ఓ మైలురాయి వంటి ఈ తీర్పు వెల్లడైన నేపథ్యంలో ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలని కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు.
 
అయోధ్య తీర్పుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ... 'ఈ తీర్పును అందరూ స్వాగతించాలి.. ఇలా చేస్తేనే దేశంలో సామాజిక సామరస్యం వర్థిల్లుతుంది. ఈ విషయంపై మరో వివాదం ఉండరాదని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా కొనసాగుతోన్న వివాదానికి ముగింపునిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శాంతి, సంయమనం పాటించాలని ప్రజలను కోరారు.

ఈ తీర్పును ప్రజలందరూ హృదపూర్వకంగా స్వాతగించాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కోరారు. ఈ తీర్పు ఒకరి గెలుపు కాదు, అలాగే మరొకరి ఓటమి కాదు అని అన్నారు. శాంతి, సంయమనం పాటించాలని ప్రజలకు చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ అదేదో తమ ఘనతగా బీజేపి చంకలు గుద్దుకోనవసరం లేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

కేంద్రంపై న్యాయస్థానానికి పూర్తిస్థాయి విశ్వాసం ఉండి ఉంటే ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుచేసి స్థలాన్ని దానికి అప్పగించాలని ఎందుకు కోరుతుందని ప్రశ్నించారు. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని ఎప్పుడో తాము కోరామని, కానీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక ట్రస్టుకే అప్పగించిందని గుర్తు చేశారు. అందువల్ల తీర్పు తమ ఘనతగా బీజేపీ చెప్పుకోరాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh