miraculous healing powers of a Mahua tree మహిమాన్విత వృక్షం.. తాకితే రోగాలు మాయం.. క్యూ కట్టేశారహో..!

Magical mahua patients on oxygen support visited healer tree in jungle

Nayagaon, mahua tree, magical mahua tree, magical mahua, madhya pradesh mahua tree, Madhya Pradesh Mahua news, Hoshangabad, Healing tree, healing tree magical mahua, healing tree, patients, Healing tree, Madhya Pradesh, Viral news

Rangers of Satpura Tiger Reserve (STR) would like to get their hands on a farmer, Roop Singh Thakur, who they suspect started the rumour of the “miraculous healing powers of a Mahua tree” that is now attracting 25,000 to 30,000 people a day.

మహిమాన్విత వృక్షం.. తాకితే రోగాలు మాయం.. క్యూ కట్టేశారహో..!

Posted: 11/08/2019 05:49 PM IST
Magical mahua patients on oxygen support visited healer tree in jungle

ఆరోగ్యమే మహాబాగ్యం అని పెద్దలు చెప్పిన మాటలు అక్షరాల నిజం. అయితే ఈ విషయం చాలా బాగా అర్థం కావాలంటే మాత్రం అనారోగ్యం బారిన పడినప్పుడే. అసుపత్రుల చుట్టూ కళ్లరిగేలా తిరిగినా.. ఏదో ఒక రోజు మందుబిల్లలు మింగడం మానేని.. దేవుడా నువ్వే నా రోగాలను నయం చేయకూడదా.? అంటూ రోగులు అర్థిస్తుంటారు. ఇందుకు కారణంగా మాత్రలు మింగినా తమ అనారోగ్యం నయంకాకపోవడమే. దీంతో దేవుడిపైనే భారం వేస్తుంటారు. అయితే దేవుడు స్వయంగా తాను దిగివచ్చి తన భక్తుల రోగాలను హరించివేయలేడు.

అయితే భక్తుల అర్తిని మాత్రం విని ఊరుకోలేడు. దీంతో తన భక్తుల రోగాలను నయం చేసేందుకు కొన్ని మార్గాలను ఎంచుకుంటాడు. అలాంటిదే ఈ మహిమాన్వి వృక్షం. సరిగా బోధపడలేదా.? మరింత క్లారిటీగా చెప్పాలంటే.. అసుపత్రులకు వెళ్లినా తమ రోగాలు నయం కాని వాళ్లు, ఐసీయూలో ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్నవారు.. ఇప్పుడు అడవిలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆ చెట్టు అదేనండీ వృక్షం తాకినా.. ఆ చెట్టు గాలి కాసింత సమయం పీల్చినా.. తమ రోగాలన్నీ నయమవుతున్నాయట. ఇలా ఒకరు కాదు ఇద్దరు ఏకంగా పది లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం ఆ వృక్షం వద్దకు వెళ్లారు.

ఔనా నిజమేనా అన్న అనుమానాలు తలెత్తే వారు కూడా ఔరా అంటూ తమ రోగాలను నయం చేసుకునేందుకు అడవి బాట పట్టారు. ఎందుకంటే ఆ వృక్షం వున్నది అక్కడే. అద్వితీయ శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్ లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని.. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో.. రోజూ 25 వేల నుంచి 30 వేల మంది వరకు అక్కడికి వెళ్తున్నారు. ఇలా నేటికి సుమారు పది లక్షల మంది వరకు ఈ చెట్టును తాకి తమ రోగాలను నయం చేసుకున్నారు.

స్థానికంగా ఉండే రూప్ సింగ్ థాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు మహిమల గురించి అందరికీ తెలిసింది. ‘‘కుంటుతూ నడిచే నేను.. ఓ రోజు పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయాను. తర్వాత నాలో ఏదో మార్పును వచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకున్నాననిపించింది. ఆరోగ్యం మెరుగు కావడంతో.. ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా’’నని ఆ రైతు మాట్లాడిన వీడియా బయటకు రావడంతో.. అక్కడికి పేషెంట్ల తాకిడి పెరిగింది. ఆ చెట్టును తాకడం ద్వారా తనకు రోగం తగ్గిపోయిందని ఓ పేషెంట్ కూడా చెప్పడంతో.. రోగాలను తగ్గించుకోవడం కోసం కొందరు వీల్ చైర్లలోనూ అక్కడికి వెళ్తున్నారు.

అయితే రోజూ వేలాదిగా తరలి వస్తున్న వారికి రోగాలు ఏమాత్రం తగ్గాయో తెలీదు కానీ.. స్థానికంగా వ్యాపారం మాత్రం పెరిగిపోయింది. మినరల్ వాటర్, స్నాక్స్, కొబ్బరి బోండాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అతీంద్రియ శక్తులున్నాయని ప్రచారం చేస్తున్న ఆ చెట్టు ఫొటోలను కూడా విక్రయిస్తున్నారు. అడవిలోని చెట్టువద్దకు రాలేని వారు ఆ ఫొటోను చూసినా రోగాలు తగ్గిపోతాయన్నమాట. జనసంచారం అధికం కావడంతో.. వన్యప్రాణులు తిరగాడే ఆ అడవిలో.. చెత్తాచెదారం భారీగా పెరిగిపోతోంది. వాటి రక్షణకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసమే చెట్టు గురించి ఈ ప్రచారం చేశారని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : magical mahua tree  healing tree  Nayagaon  patients  Hoshangabad  bhopal  madhya pradesh  Viral news  

Other Articles

Today on Telugu Wishesh