Note ban derailed economy, says Mamata Banarjee నోట్ల రద్దు విఫల ప్రయత్నమన్న మమతా బెనర్జీ

Demonetisation a terror attack rahul gandhi on three years of note ban

Rahul Gandhi, Rahul Gandhi attacks PM Modi, rahul gandhi congress, rahul gandhi tweet, rahul gandhi tweets, demonetisaion, rahul gandhi on demonetisation, demonetisation anniversary, Demonetisation, demonetisation 2019, rahul gandhi hits at BJP, demonetization, Mamata Banarjee, Bengal CM, note ban, BJP, Indian economy, modi govt, PM modi

"It’s three years since the demonetisation terror attack that devastated the Indian economy, taking many lives, wiping out lakhs of small businesses & leaving millions of Indians unemployed," Rahul Gandhi tweeted. West Bengal CM Mamata Banerjee described demonetisation as a "futile exercise".

‘‘నోట్ల రద్దు ఒక ఉగ్రదాడి..’’: ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ రాహుల్

Posted: 11/08/2019 03:20 PM IST
Demonetisation a terror attack rahul gandhi on three years of note ban

పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ బీజేపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. నోట్ల రద్దును ‘తీవ్రవాద దాడి’గా అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. నోట్ల రద్దు ఉగ్ర దాడికి మూడేళ్లు నిండాయని, ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని ఆరోపించారు. ఎంతోమంది ప్రాణాలను హరించిన ఈ నిర్ణయం మరెందరినో నిరుద్యోగులుగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో చిరు వ్యాపారాలు నోట్ల రద్దు కారణంగా ముగిసిపోయాయని అన్నారు.

నోట్ల రద్దుకు కారణమైన వారిని.. ఈ నిర్ణయం తీసుకుని దేశ ప్రజలను మాయమాటలతో నచ్చచూపిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందనవ్నారు.  పలు కుటుంబాల ఇంటిపెద్దలను మింగేసి విషాదం నింపిన వారిని కూడా బాధ్యుల్ని చేయాలని అన్నారు. ‘‘నోట్లరద్దు తీవ్రవాద దాడి జరిగి మూడేళ్లు గడిచింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఎంతో మంది ప్రాణాల్ని బలిగొంది. చిరు వ్యాపారాలను తుడిచిపెట్టేసింది. అనేక మందిని నిరుద్యోగులుగా మిగిల్చింది. ఈ దాడికి కారణమైన వారిని చట్టం ముందుకు తీసుకురావాల్సిందే’’ అంటూ రాహుల్‌ పరోక్షంగా బీజేపిపై ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం కేంద్రంపై విరుచుకుపడ్డారు. అన్ని సమస్యలకు నోట్ల రద్దే పరిష్కారమని భాజపా ఊదరగొట్టిందన్నారు. కానీ వారు పలికిన ప్రగల్భాలన్నీ అబద్ధాలుగా మిగిలిపోయాయన్నారు. దేశ ఆర్థిక చరిత్రలో నోట్ల రద్దు ఒక పెద్ద విపత్తుగా నిలిచిపోయిందన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సైతం బీజేపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  నోట్ల రద్దును ఆమె ఒక ‘వృథా చర్య’గా అభివర్ణించారు. ఒక్క ప్రకటనతో అనేక మంది భవిష్యత్తు, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యాయన్నారు.

ఈరోజు సామాన్య ప్రజలు సహా ఆర్థికవేత్తలు, నిపుణులు, విశ్లేషకులు ఈ చర్యను తప్పుబడుతున్నారన్నారు. చివరికి ఆర్బీఐ గణాంకాలు సైతం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. నవంబర్‌ 8, 2016న భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో చలామణిలో ఉన్న 86శాతం నగదు ఒక్కసారిగా చెల్లుబాటు కాకుండా పోయింది. రూ.15.44లక్షల కోట్లు విలువ చేసే రూ.500, రూ.1000 నోట్లు ఒక్కసారిగా రద్దయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM Modi  Congress  demonetisaion  BJP  Mamata Banarjee  West Bengal  

Other Articles