Constable resigns, says affecting marriage prospects వెళ్లి పెళ్లి చేసుకో ప్రతాప్: ఆశీర్వదించిన పోలీస్ కమీషనర్

Hyderabad constable resigns says affecting marriage prospects

Siddarthi Pratap, constable, Charminar police station, SHO, charminar station house officer, Constable Resignation, Marriage proposals, Personal reasons, growth opportunites, Hyderabad police commissioner, Anjani kumar, commissioner of police hyderabad, Hyderabad, Telangana

Hyderabad City Police Commissioner Anjani Kumar accepted the resignation of Siddarthi Pratap, a constable of the Charminar police station, and issued orders to relieve him. He did not see any growth opportunities in the Police Department and that his marriage proposals were being rejected on the same grounds.

వెళ్లి పెళ్లి చేసుకో ప్రతాప్: ఆశీర్వదించిన పోలీస్ కమీషనర్

Posted: 11/05/2019 07:03 PM IST
Hyderabad constable resigns says affecting marriage prospects

చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ గుర్తున్నాడా? పెళ్లి కోసం తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించిన కానిస్టేబుల్ ప్రతాపే ఈ సిద్దాంతి ప్రతాప్. బీటెక్ చదివి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడు రెండు నెలల క్రితం పై అధికారులకు రాసిన రాజీనామా లేఖ సంచలనమైంది. పెళ్లి కోసం ప్రతాప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వబోమంటూ అమ్మాయి తరపు పెద్దలు చెప్పడంతో మనస్తాపం చెందిన ప్రతాప్ తనకు ఎదురైన అనుభవాలతో ఉన్నతాధికారులకు లేఖ రాశాడు.

ఇంజినీరింగ్ చదివినా పోలీస్ శాఖపై మక్కువతో ఉద్యోగంలో చేరిన తనకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రతాప్ ఆ లేఖలో వాపోయాడు. కానిస్టేబుల్ అంటే రోజంతా పని ఉంటుందని, కాబట్టి తాను పెళ్లి చేసుకోలేనని ఓ అమ్మాయి తనతో నేరుగా చెప్పిందని పేర్కొన్నాడు. అంతేకాదు, పోలీస్ శాఖలో ప్రమోషన్లు అంతంత మాత్రమేనని, 20 ఏళ్ల క్రితం కానిస్టేబుల్‌గా చేరిన వారు కూడా చివరికి హెడ్‌ కానిస్టేబుల్‌గానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ కు రాజీనామా లేఖ రాశాడు. తాజాగా, ప్రతాప్ లేఖను పరిశీలించిన సీపీ.. అతని రాజీనామాను ఆమోదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles