Man Refuses to take Reward after returning lost cash చిల్లిగవ్వ లేకున్నా.. దొరికిన డబ్బును తిరిగిచ్చిన ఉత్తముడు..

Man with rs 3 in pocket refuses reward for returning rs 40 000 lying at a bus stop

Dhanaji Jagdale, bus fare, Rs 7, Maharashtra honest man, Pingali village honest man, Satara's Maan taluka honest man, maharashtra bus stop rs 40000

A lump sum amount of 40,000 lying precariously at a bus stop did not tempt a 54-year-old, Dhanaji Jagdale from Satara, Maharashtra as he returned the money to its rightful owner.

చిల్లిగవ్వ లేకున్నా.. దొరికిన డబ్బును తిరిగిచ్చిన ఉత్తముడు..

Posted: 11/05/2019 05:54 PM IST
Man with rs 3 in pocket refuses reward for returning rs 40 000 lying at a bus stop

జేబులో లక్షల రూపాయలు వున్నా.. మనది కాని డబ్బు కనబడితే దానిని సొంత చేసుకునే రోజులివి. అందుకోసం అవసరమైతే అబద్దాలను సునాయాసంగా అడేసి.. డబ్బును సొంత చేసుకునేందుకు పోటీ పడే సమాజంలో వున్నాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే.. కలికాలంలో ఇలానే వుండాలి. లేకపోతే బతకలేం అంటూ మనల్ని మనమే మోసం చేసుకుని.. మన నిజాయితీని మనమే గాయపర్చుకుంటాం. ఇంత చేసినా.. తిరిగి చూసుకుంటే డబ్బు ఏమాత్రం ఆనందాన్ని, సుఖాన్ని సంతోషాన్ని, మనశాంతిని ఇవ్వదని తెలుసుకన్నాక డబ్బు శాశ్వతమా.? నీతి, నిజాయితి, మాట, ధర్మం, అంటూ పలు విషయాలను వల్లెవేస్తాం.

కానీ మంచితనం, వ్యక్తిత్వం ఎంత డబ్బు వున్నా కొనలేనివని తెలుసుకోవాలి. సంపద రూపేనా లక్ష్మీ కటాక్షం లేని ఆ పేదవాడికి.. సముద్ర తనయ ఏకంగా మంచి వ్యక్తిత్వాన్ని, నీతి, నిజాయితీలలో అపర కుబేరుడ్ని చేసింది. అయితే ఈ విషయం ఎప్పుడూ బయటపడదు కానీ.. సమయానుకూలంగా ప్రదర్శింపబడుతోంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 54 ఏళ్ల జగ్దాలే.. ఓ రోజు బస్టాండ్‌లో నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో అతడికి ఓ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్‌ తెరిచి చూస్తే.. అందులో డబ్బుల కట్టలు ఉన్నాయి.

ఆ బ్యాగ్ తీసుకున్న జగ్దాలే.. ఆ చుట్టుపక్కల వారిని అడిగాడు. కానీ, వారెవరూ ఆ బ్యాగ్ తమది కాదని చెప్పారు. అంతలో ఓ వ్యక్తి ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వెతకడం చూసి.. అతడిని అడిగితే.. తన డబ్బు పోయిందని చెప్పాడు. తన వద్ద ఉన్న బ్యాగ్‌ను తీసి చూపించగా, ఆ డబ్బు తనదేనని చెప్పాడు. తన భార్య ఆపరేషన్ కోసం ఆ డబ్బు జమచేసుకున్నానని, అవి బస్టాండ్‌లో పొరపాటున మర్చిపోయానని చెప్పాడు.

దీపావళి రోజు వారింట్లో నిజంగానే దీపాలు వెలిగించాడు జగ్దాలే. అతడి మంచితనానికి ముచ్చటేసి... ఆ డబ్బు యజమాని జగ్దాలేకి రూ.1000 ఇవ్వబోయాడు. కానీ, ఆ బహుమానాన్ని అతడు తిరస్కరించాడు. తన సొంతూరు వెళ్లడానికి ఓ రూ.7 మాత్రమే తీసుకున్నాడు. జగ్దాలే మంచితనాన్ని చూసి.. సతారా ఎమ్మెల్యే శివానందరాజే భోసాలే, ఇతర స్వచ్ఛంద సంస్థలు అతడిని సత్కరించాయి. కానీ, వారి వద్ద అతడు ఒక్క రూపాయి కూడా బహుమానంగా తీసుకోలేదు.

అంత మంది అన్ని రకాలుగా డబ్బులు ఇస్తున్నా.. వద్దంటున్న అతడి మంచితనాన్ని చూసి ముగ్ధుడయిన రాహుల్ బార్గే అనే ఓ ఎన్ఆర్ఐ.. అతడికి ఏకంగా రూ.5లక్షలు ఇస్తానని ముందుకొచ్చాడు. కానీ, ఆ డబ్బులు కూడా తనకు వద్దని చెప్పాడు జగ్దాలే. జగ్దాలేకి బస్టాండ్‌లో రూ.40వేలు దొరికినప్పుడు అతడి జేబులో కేవలం రూ.3 మాత్రమే ఉన్నాయట. సొంతూరు వెళ్లడానికి బస్ టికెట్ డబ్బులు రూ.7 మాత్రమే తీసుకోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles