first aadhaar seva kendra in hyderabad హైదరాబాదీల ఆధార్ కష్టాలకు.. సేవా కేంద్రంతో చెక్.!

Uidai opens first aadhaar seva kendra in hyderabad madhapur

Aadhaar Card, Aadhaar UIDAI, UIDAI, Aadhaar service kendra, Aadhaar sevice center, Aadhaar seva Kendra, offline sevices, online services, vittal rao nagar, madhapur, hyderabad, Telangana

Aadhaar Seva Kendra update six kinds of data about your Aadhaar details such as Aadhaar enrolment, address update, photo/biometric update, name/gender/ DOB, mobile number/email id update and also get the Aadhaar download and coloured print.

హైదరాబాదీల ఆధార్ కష్టాలకు.. సేవా కేంద్రంతో చెక్.!

Posted: 11/01/2019 02:49 PM IST
Uidai opens first aadhaar seva kendra in hyderabad madhapur

మీకు ఆధార్ సేవలు అవసరమైతే దగ్గర్లోని ఆధార్ సెంటర్ కు వెళ్తుంటారు కదా? స్థానికంగా సేవలు అందించే ఆధార్ సెంటర్లతో పాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఉడాయ్ (UIDAI) దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేకంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటైంది. ఇక దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆధార్ సేవ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ వాసుల కోసం తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోనే తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది ఉడాయ్ (UIDAI).

ఇప్పటికే హైదరాబాద్‌లో స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లతో పాటు 236 బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బీఎస్ఎన్ఎల్ కేంద్రాల్లో పౌరులకు ఆధార్ సేవలు లభిస్తున్నాయి. వీటితో పాటు మాదాపూర్‌లోని ఆధార్ సేవా కేంద్రం పౌరులకు అందుబాటులోకి వచ్చింది. మాదాపూర్‌లోని విఠల్ రావు నగర్‌లో రిలయెన్స్ సైబర్ విల్లాలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది UIDAI. వారంలో 7 రోజులు ఈ ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది. రోజుకు 1000 మందికి సేవలు పొందొచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది.

అనునిత్యం హైదరాబాదీయులకు అందుబాటులో వుంటూ సేవలందించేందుకు సిద్దంగా వున్న ఈ ఆధార్ సేవా కేంద్రం వారంలో ఏడు రోజులు పనివేళల్లో నగరవాసులకు అందుబాటులో వుంటుంది. ఎన్‌రోల్‌మెంట్ ఫీజు రూ.50. ఈ ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ సేవలు పొందాలనుకునేవారు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. https://ask.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ఇక ఇదే తరుణంలో హైదరాబాదు పోస్టల్ శాఖ కూడా నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఆదార్ సేవలను ఇంటివద్దనే అందించే విధంగా ఫైలట్ ప్రాజక్టును చేపట్టింది. అయితే ఒకరిద్దరు ఇంటిదగ్గర ఆధార్ సేవలు పొందాలనుకుంటే కుదరదు. కనీసం 30 మంది ఉంటి వారికి ఇంటి దగ్గర ఆధార్ సేవలు అందుతాయి. ప్రజలకు ఆధార్ సేవల్ని మరింత దగ్గర చేయాలన్న ఉద్దేశంతో పోస్టల్ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అపార్ట్‌మెంట్‌వాసులు, కాలనీవాసులు కలిసి ఒకేసారి ఆధార్ సేవలు పొందేందుకు అద్భుతమైన అవకాశమిది. మరి మీ కాలనీలో లేదా అపార్ట్‌మెంట్‌లో కనీసం 30 మంది ఆధార్ సేవలు పొందాలనుకుంటే 9440644035 నెంబర్‌కు కాల్ చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles