Maharashtra will have Shiv Sena cm: Sanjay Raut మహారాష్ట్ర సీఎం ఎవరన్న అంశమై సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shiv sena s sanjay raut asks bjp to shun arrogance as power tussle continues

BJP, Shiv Sena, Devendra Fadnavis, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

Shiv Sena leader Sanjay Raut on Friday renewed his attack against the BJP in Maharashtra, asking the ally to “not feed its arrogance” as his party was capable of forming the government on its own.

మహారాష్ట్ర సీఎం ఎవరంటే: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 11/01/2019 10:33 AM IST
Shiv sena s sanjay raut asks bjp to shun arrogance as power tussle continues

మహారాష్ట్రలో మిత్రపక్ష కూటమి బీజేపి-శివసేన పార్టీల మధ్య సయోధ్య కుదిరి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ వ్యాఖ్యానించారు. అయితే బీజేపి శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనంత మాత్రనా.. వారే ముఖ్యమంత్రి అవుతారని ఎవరు చెప్పగలరని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ తాజాగా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపి మధ్య ప్రస్తుతం చర్చలు జరగడం లేదని తేల్చిచెప్పిన ఆయన.. శివసేనకు చెందిన నాయకుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని రెండున్నరేళ్ల కాలం పాటు ఒకరు.. మరో రెండున్నరేళ్ల కాలం పాటు మరోకరు పంచుకోవాలంటూ తాము పెట్టిన డిమాండ్ ను బీజేపి అంగీకరించని పక్షంలో తమ పార్టీకి చెందిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ఆయన తేల్చిచెప్పారు. వర్లీ నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్దవ్ థాక్రే కుమారుడు అదిత్య థాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని పార్టీ కోరుతతోంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'బీజేపీకి మేము ఎటువంటి అల్టిమేటమూ జారీ చేయాలని అనుకోవట్లేదు. ఆ పార్టీ వారు గొప్ప నేతలు. ఒకవేళ శివసేన ఇతర పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే స్థిరమైన సర్కారు ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. కానీ, రాష్ట్రంలో 50-50 ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు. అలాగే, వారు శివసేన నేతే సీఎం కావాలని కోరుకుంటున్నారు.  మేము రైతుల కష్టాలను వివరించి చెప్పేందుకే గవర్నర్ ను కలుస్తున్నాం. ఇందులో మరే ఉద్దేశం లేదు' అని వ్యాఖ్యానించారు.

అయితే అధికార పంపకం ఫార్ములకు అంగీకరించని బీజేపి.. మధ్యే మార్గాన్ని అవలంభించింది. మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి సహా, 14 మంత్రి పదవులను ఇవ్వాలని బీజేపీ నిర్ణయించగా అందుకు శివసేన ససేమిరా అంటోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపి మరోమారు క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని నిర్ణయాలను వెలువరించాలని సూచించింది. కూటమిగా ప్రజల ముందుకు వెళ్లిన తమను మహారాష్ట్రవాసులు అమోదం తెలిపినందున ఇద్దరం కలిసే అధికారాన్ని అనుభవించాలని అందుకు అధికార మార్పిడి ఒక్కటే మార్గమని శివసేన తేల్చిచెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles