Honda Activa sold out at Rs 5, 10 coins చిల్లర నాణేలకు హోండా యాక్టివా అమ్మకం..

Mp man buys honda activa by making payment in rs 5 10 coins

Honda Activa, Honda Activa scooty, Dhanteras, Rakesh Gupta, Rs 5, 10 coins, Satna district, Madhya Pradesh

A customer in Satna district of Madhya Pradesh purchased a new Honda Activa scooty on Dhanteras with the entire amount paid in coins. Rakesh Gupta brought only five and 10 rupee coins to Krishna Honda showroom here on Dhanteras in 4 gunny bags and paid Rs 83,000 and rode home on his all new Activa 125 BSVI.

చిల్లర నాణేలకు హోండా యాక్టివా అమ్మకం..

Posted: 10/28/2019 03:49 PM IST
Mp man buys honda activa by making payment in rs 5 10 coins

దసరా, దీపావళి పండగలు వచ్చాయంటే వాహన కంపెనీలకు నిజమైన పండుగ. కొత్త వాహనాలు కోనాలని భావించేవారు సంటిమెంటుగా ఈ పండుగ పర్వదినాల్లో కొనుగోలు చేస్తుండటంతో్ వారికోసం పండుగ ఆపర్లను కూడా ప్రకటిస్తుంటాయి వాహన సంస్థలు. ఇక ముఖ్యంగా ధన్ తెరాస్ పర్వదినాన వాహనాలు కొనాలన్న సెంటిమెంట్ ఉత్తరాది ప్రజల్లో పెనవేసుకుంటుంది. ఈ సెంటిమెంట్ అక్కడి నుంచి దక్షిణాదికి కూడా విస్తరించింది. ఈ రోజున ఏది కొనుగోలు చేసినా కలసివస్తుందని ప్రజలు విశ్వసిస్తుంటారు.

ఇదేమాదిరిగా భావించిన మధ్యప్రదేశ్ లోని శాంటా జిల్లాకు చెందిన వ్యక్తి కూడా హోండా యాక్టివాను కొనాలని ముచ్చటపడ్డాడు. అతడి పేరు.. రాకేశ్ గుప్తా.. ఎన్నో ఏళ్లుగా పొగుచేసిన చిల్లరంతా బయటికి తీశాడు. నాలుగు గోనెసంచుల్లో చిల్లరంతా కుక్కేశాడు. నేరుగా షోరూంకు చిల్లరతో వెళ్లాడు. తనకు నచ్చిన హోండా యాక్టివాను సెలెక్ట్ చేసుకున్నాడు. రేటు మాట్లాడుకున్నాడు. చివరికి రూ.83వేలకు రేటు ఫిక్స్ అయింది. ఇంకేముంది డబ్బులు కట్టి బండి తీసుకుపోవడమే మిగిలింది.

అప్పుడే యాక్టీవా షోరూమ్ యజమాన్యానికి షాక్ ఇచ్చాడు రాకేష్ గుప్తా. వెంటనే తన వెంట తెచ్చిన గోనె సంచులను తెరిచాడు. వేలాది రూపాయల నాణేలను షోరూంలో రాశుల్లా పోశాడు. దులో రూ.5, రూ.10 నాణేలు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.83వేలు చెల్లించాడు. అంతా చిల్లర నాణేలే కావడంతో షోరూం వాళ్లు కంగుతిన్నారు. తెచ్చిన చిల్లరంతా లెక్క పెట్టడానికి వారికి 4 గంటల సమయం పట్టింది. లెక్క సరిపోవడంతో సంతోషంతో కొత్త హోండా యాక్టివా 125 (బిఎస్ 4)ను రైడ్ చేసుకుంటూ గుప్తా ఇంటికి వెళ్లాడు.

షోరూం మేనేజర్ అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ.. దంతే రష్ సందర్భంగా మా షోరూంకు రాకేశ్ గుప్తా అనే వ్యక్తి గోనె సంచులతో వచ్చాడు. హోండా యాక్టివా 125 బిఎస్ 4 వెహికల్ కొనాలని చెప్పాడు. షోరూం యజమాని అశిష్ పూరితో మాట్లాడానని చెప్పాడు. ముందుగా గుప్తా తెచ్చిన సంచుల్లోని నాణేలను లెక్కించాం. దంతే రష్ రోజున కస్టమర్లను అసంతృప్తికి గురిచేయరాదనే ఉద్దేశంతో ఆ చిల్లర నాణేలను తీసుకున్నాం’ అని మిశ్రా తెలిపారు.

గుప్తా తెచ్చిన చిల్లర నాణేలను లెక్కించడానికి షోరూంలో ముగ్గురు వర్కర్లు నాలుగు గంటల పాటు శ్రమించారని తెలిపారు. అయితే గుస్తా తెచ్చిన చిల్లర యాక్టివా ధరకు మించి వున్నందున.. మిగిలిన చిల్లరను గుప్తాకు అప్పజెప్పడంతో పాటు యాక్టివాను కూడా ఇచ్చి పంపించామన్నారు. హోండా మోటార్ సైకిల్ కంపెనీ ఇటీవల కొత్త యాక్టివా 125ను మార్కెట్లలో లాంచ్ చేసింది. ఇదో టాప్ ఎండ్ డిస్క్ బ్రేక్ వేరియంట్. బిఎస్-VI కంప్లయింట్ ఉద్గార ప్రమాణాలతో ఈ వేరియంట్ వచ్చింది. దీని ధర (ఎక్స్ -షోరూం) రూ.74వేల 490గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honda Activa  Honda Activa scooty  Dhanteras  Rakesh Gupta  Rs 5  10 coins  Satna district  Madhya Pradesh  

Other Articles