Lalitha Jewellery heist: Mastermind surrenders in Court కోర్టులో లొంగిపోయిన లలితా జ్యుయెలరీ చోరీ మాస్టర్ మైండ్

Mastermind behind trichy lalitha jewellery heist surrenders in court

Murugan, Bengaluru court, Cine Producer, Lalitha jewellery, Trichy, robbery, theft, Tamil Nadu, crime

The prime accused in the Lalitha Jewellery heist, surrendered in Tiruvannamalai court, the alleged mastermind behind the crime, Murugan, surrendered at a court in Bengaluru on Friday.

కోర్టులో లొంగిపోయిన లలితా జ్యుయెలరీ చోరీ మాస్టర్ మైండ్

Posted: 10/11/2019 05:06 PM IST
Mastermind behind trichy lalitha jewellery heist surrenders in court

తిరుచ్చి లలితా జ్యుయెలరీ చోరీ కేసు దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చోరీకి సూత్రధారి ఓ సినీ నిర్మాత అని తెలియడంతో ఆశ్చర్యపోయిన జనాలు, అతడిపై 100కి పైగా కేసులున్నాయని తెలిసి నివ్వెరపోయారు. దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతడి పేరు మురుగన్. తెలుగులో కొన్ని సినిమాలు కూడా తీసిన ఈ కేటుగాడు మరింత డబ్బు కోసం లలితా జ్యుయెలరీ షాపుకు కన్నంవేశాడు.

ఆరోగ్యం బాగాలేని స్థితిలో సరిగా నడవలేకపోతున్న మురుగన్ పక్కాగా చోరీ స్కెచ్ వేయగా, అతని మేనల్లుడు సురేశ్ పకడ్బందీగా అమలు చేశాడు. అయితే సురేశ్ కోర్టులో లొంగిపోవడంతో చేసేదిలేక ప్రధాన నిందితుడు మురుగన్ కూడా లొంగుబాట పట్టాడు. మురుగన్ బెంగళూరు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. మురుగన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుచ్చి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murugan  Bengaluru court  Cine Producer  Lalitha jewellery  Trichy  robbery  theft  Tamil Nadu  crime  

Other Articles