Tension prevails over Kollu Ravindra arrest మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. ఉద్రిక్తత

Tension prevails over former minister kollu ravindra arrest in bandar

Tension prevails in Koneru center, Tension prevails in machilipatnam, Tension prevails in Krishna, Tension prevails in Bandar, Tension prevails in Andhra Pradesh, Sand policy in Andhra Pradesh, TDP leaders house arrest, Kollu Ravindra, Konkalla Narayana, Bachchula Arjuna, TDP leaders, sand policy, Andhra Pradesh, Politics

Former B.C. Welfare Minister and TDP leader Kollu Ravindra had been arrested at Koneru center in Machilipatnam of Krishna district by Police forces, for questioning the state government over the sand crisis.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. ఉద్రిక్తత

Posted: 10/11/2019 12:34 PM IST
Tension prevails over former minister kollu ravindra arrest in bandar

మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్‌ వద్ద ఆయన తలపెట్టిన 36 గంటల దీక్షను భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. కొల్లు రవీంద్ర అరెస్టును టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుతొలగించుకుని రవీంద్రను అరెస్టు చేశారు. ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది.

తొలుత కొల్లు రవీంద్రను గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. ఆయనను కూడా మిగతా టీడీపీ నేతల మాదిరిగానే గృహనిర్భంధం చేయాలన్న పోలీసుల ప్రయత్నాలు బెడసికొట్టాయి. అయితే ఈ సమాచారాన్ని ముందుగానే అందుకున్న ఆయన అప్పటికే వేరే మార్గంలో కోనేరు సెంటర్‌కు రవీంద్ర చేరుకున్నారు. ఆయన పిలుపునిచ్చిన మేరకు 36 గంటల దీక్షను కొనసాగించేందుకు సన్నధం కాగా అక్కడకు చేరుకున్న పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : House arrest  Kollu Ravindra  TDP leaders  sand policy  Machilipatnam  Andhra Pradesh  Politics  

Other Articles