Former MLC KR Amos passes away తొలితరం తెలంగాణ ఉద్యమ నేత అమోస్ కన్నుమూత

Separate telangana movement leader kr amos passes away at 74

Telangana movement leader, Telangana movement, KR Amos, K Brahmananda Reddy government, Former Congress MLC, Indian Constitution, CM KCR, KT Rama Rao, Telangana, Politics

First-generation separate Telangana movement leader and former Member of Legislative Council (MLC) KR Amos breathed his last here on Thursday night. He was 74.

తొలితరం తెలంగాణ ఉద్యమ నేత అమోస్ కన్నుమూత

Posted: 10/11/2019 09:19 AM IST
Separate telangana movement leader kr amos passes away at 74

తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్. ఆమోస్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మల్కాజ్ గిరిలో తన నివాసంలో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆమోస్ కీలక పాత్ర పోషించారు. టీఎన్‌జీవో అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యమంలో పాల్గొని సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు.

దేశంలో ఉద్యమం కారణంగా ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన తొలి వ్యక్తిగా చరిత్రలో ఆమోస్ చిరకాలం నిలిచిపోతారు. ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్సీగా సేవలందించారు. 2016లో ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయన అనారోగ్యం కారణంగా మరోమారు ఎమ్మెల్సీ పదవి వద్దని కూడా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టం చేశారు.

తెలంగాణ తొలిధశ ఉద్యమ నేత కేఆర్ ఆమోస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆమోస్ ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తిని, త్యాగనిరతిని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అమోస్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana movement  KR Amos  Former Congress MLC  CM KCR  Telangana  Politics  

Other Articles