Pawan on TSRTC strike: Both parties should resolve it కార్మికులను తొలగింపు వార్తలపై కలవరం: పవన్ కల్యాణ్

Jana sena pawan kalyan letter to govt and tsrtc employees

TSRTC Workers removal, Tsrtc employees pawan kalyan, tsrtc staff strike janasena, tsrtc employees termination, ignore Govt warning, Maoist letter, maoist leader jagan, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Strong Warning To CM KCR, CM KCR, Warning To CM KCR, tsrtc workers strike, IAS committee tsrtc, face to face with tsrtc workers, tsrtc to merge in government, ts government

Jana Sena President Pawn Kalyan open letter to Telangana Government and TSRTC employees, states both the parties should mutually solve the issues.

కార్మికులను తొలగింపు వార్తలపై కలవరం: పవన్ కల్యాణ్

Posted: 10/07/2019 04:36 PM IST
Jana sena pawan kalyan letter to govt and tsrtc employees

తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సమ్మెకు దిగిన నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించాలన్న నిర్ణయం ఆందోళనకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేసే చివరి ప్రయత్నమే సమ్మె అని గుర్తెరిగి వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆయన పేర్కోన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెను చేపట్టిన సమ్మె 48వేల 600 పైచిలుకు కార్మికులను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వస్తున్న వార్తలు కలవరానికి గురిచేస్తున్నాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొనకుండా విధులను నిర్వహిస్తున్న 1200 మందిని మాత్రమే మినహాయించి.. మిగిలిన అందరినీ తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళనకరమని అన్నారు.

‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సాగిన సకల జనుల సమ్మెలో పదిహేడు రోజులపాటు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమానికి అండగా ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపి ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాను’’ అని పవన్‌ పేర్కొన్నారు.

కార్మిక సంఘాల జేఏసీ నేతల అరెస్ట్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ ఐకాస నేతలు నివాళులర్పించేందుకు అక్కడికి వెళ్లడంతో.. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ ఐకాస ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు వద్ద భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితో సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. నివాళులర్పించేదుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకోవడాన్ని ఐకాస నేతలు తప్పుబట్టారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తమ త్యాగాల ఫలితంగగా ఇవాళ తెరాస అధికారంలో ఉందన్నారు. అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  TSRTC Srike  TS Employees  CM KCR  employees termination  Telangana  

Other Articles