police searches on for ex mp gv harsha kumar మాజీ ఎంపీ హర్షకుమార్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు..

Police searches on for amalapuram ex mp gv harsha kumar eluru dgp

harsha kumar, amalapuram ex MP, godavari river, tourist boat accident, kacchaluru, rajamundry, andhra Pradesh, politics

police form four team in search of former MP Harsha Kumar for making false allegations on minister and Government, says Eluru ranga DIG Khan.

మాజీ ఎంపీ హర్షకుమార్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు..

Posted: 10/03/2019 11:09 AM IST
Police searches on for amalapuram ex mp gv harsha kumar eluru dgp

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటకుల బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వంపై అరోపణలు చేసిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారని హర్షకుమార్ ఆరోపించారు. బోటు నదిలోకి వెళ్లడాన్ని అడ్డుకున్న పోలీసులపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తడి తీసుకువచ్చారని కూడా అరోపించారు. బోటు ప్రమాదంలో మరణించిన వారి హత్యలన్నీ అవంతి హత్యలుగానే పరిగణించాలని డిమాండ్ చేశారు.

ఇక బోటు నదీలోకి వెళ్లే సమయంలో పోలీసులు కూడా ఫోటోలను తీసారని, వాటిని ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని హర్షకుమార్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలో అరోపణలు చేసిన హర్షకుమార్ వద్దనున్న సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే వాటిపై హర్షకుమార్ స్పందించలేదు. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా.. ఆయన ఆచూకీ దొరకలేదు.

దీనికి తోడు చట్టవ్యతిరేకంగా వ్యవహరించి తప్పించుకు తిరుగుతున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, ఏ క్షణమైనా ఆయనని అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ ఎ.ఎస్‌.ఖాన్‌ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించడం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి పలు కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు.

ఇటీవల రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా హర్షకుమార్‌ ఘటనా స్థలికి వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించారని, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించారని తెలిపారు. అక్కడి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. దీనిపై జిల్లా కోర్టు పరిపాలనాధికారి మూడో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఐజీ వివరించారు. దీంతో ఆయన కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని  ఏలూరు రేంజ్‌ డీఐజీ ఖాన్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles