Court Grants Conditional Bail To Sivaram కోర్టులో లొంగిపోయిన కోడెల కుమారుడు శివరాం

Court grants conditional bail to kodela siva prasad s son sivaram

Kodela Sivaram surrenders in court, Former AP speaker, Kodela Sivaprasad, Kodela Sivaram, Additional Munsiff Magistrate's Court, Narasaraopet Court, Guntur, Andhra pradesh, Crime

Former AP speaker Kodela Sivaprasad's son Sivaram surrendered in court a short while ago. The Additional Munsiff Magistrate's Court in Narasaraopet, granted bail to Sivaram in all the cases registered against him.

కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం.. బెయిల్ మంజూరు

Posted: 10/01/2019 07:49 PM IST
Court grants conditional bail to kodela siva prasad s son sivaram

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం ఇవాళ రోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల కుటుంబంపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో కోడెల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని అరోపణలు వున్నాయి.

కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్ గా ప్రజల్లో ప్రాచుర్యం పోందిన అదనపు పన్ను) పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని శివరామ్‌పై ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక శివరాంతోపాటు ఆయన సోదరిపై కూడా 19 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ, ముందస్తు బెయిల్ కోసం శివరాం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో... ఆయన కోర్టు ఎదుట లొంగిపోయారు.

 న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన ఆరు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన కుమారుడే కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. అయితే కోడెల మరణించిన తరువాత కూడా ఆయన కుటుంబసభ్యులపై కూడా వైఎస్సార్ సర్కార్ ప్రతీకారపూరితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసిందని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు, కాగా గత కొంత కాలంగా విదేశాల్లో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలిసిన తర్వాత ఆయన కెన్యా నుంచి తిరిగొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former AP speaker  Kodela Sivaprasad  Kodela Sivaram  Narasaraopet Court  Andhra pradesh  Crime  

Other Articles