Tirumala Bramhostavam to start with Dwajarohanam తిరుమల బ్రహ్మోత్సవాలు: ధ్వజారోహనంతో ప్రారంభం..

Tirumala bramhostavam to start today with dwajarohanam cm to present silk clothes

tirumala,tirumala brahmotsavam,tirumala tirupati devasthanams,tirumala srivari brahmotsavam 2019,srivari brahmotsavam 2019,tirumala srivari brahmotsavam,brahmotsavam,srivari brahmotsavam,tirumala brahmotsavam 2019,tirumala tirupati brahmotsavam 2019,tirumala brahmotsavam 2019 schedule,tirumala brahmotsavam 2018,brahmotsavams 2019,tirumala brahmotsavam song,tirumala brahmotsavam 2018 dates

AP CM YS Jagan will be visiting Tirumala today before the dwajarohanam starts, on the first day of the annual Brahmotsavam celebrations, and present silk robes to Lord Venkateswara as part of the customary ritual.

తిరుమల బ్రహ్మోత్సవాలు: ధ్వజారోహనంతో ప్రారంభం.. సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Posted: 09/30/2019 11:28 AM IST
Tirumala bramhostavam to start today with dwajarohanam cm to present silk clothes

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణను నిర్వహించారు అర్చకదేవుళ్లు. ఆలయ మాడవీధుల్లో స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడి ఊరేగింపు జరగగా ఆలయ నైరుతి మూలలో భూమిపూజ నిర్వహించారు. అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో శ్రీవారి బ్రహోత్సవాల అంగరంగ వైభవ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ నిర్వహించిన అర్చకలు, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేశారు. ఇక ఇవాళ సాయంత్రం  గం.5-23 నిమిషాల నుంచి 6 గంటల  మధ్య  మీన లగ్న సుమూహూర్తంలో ధ్వజారోహణ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంతో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవ వేడుకలకు సకల దేవతామూర్తులనూ ఆహ్వానిస్తారు.

శ్రీవారి వాహనం గరుడుడు కాబట్టి, కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరించి.. దానిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. దీనిని 'గరుడ ధ్వజ పటం' అంటారు. గరుడ ధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే "న భూతో న భవిష్యతి" అనేలా జరిగే అనంతకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు అహ్వానపత్రం.

ఈ వేడుకులకు సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అరుదైన వేడుక ఇవాళ సాయంత్రం నిర్వహిస్తారు.

వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం జరిగే ధ్వజారోహణ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్న మలయప్పస్వామి సేవలో సీఎం పాల్గొంటారు. ఈ క్ర‌మంలోనే రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala brahmotsavam  dwajarohanam  ankurarpana  CM Jagan  silk robes  TTD  Devotional  

Other Articles